Rashmika mandanna:టాలీవుడ్ లో క్యూట్ కపుల్స్ గా పేరు సంపాదించిన విజయ్ దేవరకొండ , రష్మిక రిలేషన్ మీద గత పది రోజులుగా సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతూనే ఉంది. వివాహమైన కొద్ది నెలలకే వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎట్టకేలకు రష్మిక స్వయంగా ఆ విషయాలకు గట్టి కౌంటర్ వేశారు. ఒక ఇంటర్వ్యూలో వచ్చిన ప్రస్తావనను వక్రీకరిస్తూ చాలా మంది నెటిజెన్స్ విమర్శలు చేశారు. ఈ విషయం పైన రష్మిక ఇన్స్టాగ్రామ్ వేదికలో ఒక పోస్టుని షేర్ చేసింది.
విజయ్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్..
నెట్టింట కొంతమంది వ్యక్తులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ.. ఆగ్రహంతో కూడిన గుంపు దాడి చేస్తున్న తీరును ఆమె తప్పు పట్టారు. ఇటీవలే వీరిద్దరి బంధం పైన జరుగుతున్న చర్చలలో వందసార్లు ప్రపోజల్, సంవత్సరాల సమయం లేదా ఎన్నిసార్లు అడిగారు అనే అంశం పైన పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైంది.. విజయ్ రష్మికను (Rashmika mandanna)సరిగ్గా చూసుకోవడం లేదని, రష్మిక ఆ బంధం నుంచి బయటికి రావాలని కోరుకుంటోంది అంటూ వస్తున్న వార్తలపై చాలా ఘాటుగానే స్పందించింది రష్మిక.
ALSO READ:Rajasekhar:రాజశేఖర్- శ్రీదేవి పెళ్లి జరగకపోవడానికి కారణం..?
వంద సార్లు కాదు 1000 సార్లు అయినా చెబుతాను.
రష్మిక ఈ విషయం పైన సూటిగా మాట్లాడుతూ.. మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ, గ్రాండ్ ప్రపోజల్స్ గురించి, రింగులు తొడగడం గురించి, ఒజీవితంలో ఎదురయ్యే కొన్ని ఎత్తుపల్లాలను కలిసి ఎదుర్కోగలమా లేదా అనే విషయాలు పైన ప్రాక్టికల్‌గా విజయ్ ఆలోచించడానికి ఎక్కువ సమయం తీసుకున్నారు. నాకు ఏం కావాలో నాకు బాగా తెలుసు. తను ఆలోచించి అడుగు వేసే వ్యక్తి. మేము ఒకరినొకరము అర్థం చేసుకొని నిలబడాలనే నిర్ణయించుకున్నాము.. అతడు 100 సార్లు కాదు 1000 సార్లు ఆలోచించినా నాకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ రష్మిక తేల్చి చెప్పేసింది.. నేను భాగస్వామితో అభ్యన్స్ అయ్యాను.. అందులో ఎలాంటి తప్పేమీ లేదు. నేను ప్రేమించి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి.. అమితంగా ప్రేమ ఉండడంలో ఎలాంటి తప్పులేదు. నా జీవితాంతం తోడుగా ఉండే స్నేహితుడు, నా పిల్లలకు కాబోయే తండ్రి నాతో పాటు వృద్ధాప్యాన్ని పంచుకోబోయే నా మనిషి అంటూ విజయ్ పైన తనకున్న ప్రేమను ప్రకటించింది.
ALSO READ:star heroin:రొమాంటిక్ సీన్ లో హీరోయిన్ లిప్ కొరికేసిన స్టార్ హీరో..రచ్చ రచ్చ..!
ఉచిత సలహా ఇచ్చే నెటిజన్స్ కి స్ట్రాంగ్ కౌంటర్..
అలాగే ఉచిత సలహాలు ఇచ్చే నెటిజన్స్ గురించి మాట్లాడుతూ.. నా జీవితంలో అత్యంత గడ్డు పరిస్థితి ఎదురైనప్పుడు మీరెవరు లేరు నా ఎముక విరిగినప్పుడు నెలకు వచ్చే నొప్పులతో బాధపడుతున్నప్పుడు అర్థరాత్రి ఆందోళనతో మేలుకున్నప్పుడు మీరు ఎవరూ లేరు. అతను మాత్రమే నా వెంట ఉన్నాడు అంటూ అత్యంత సున్నితమైన, వ్యక్తిగత విషయాలను ప్రస్తావించి విమర్శలు చేసే వాళ్ల నోరు మూయించింది రష్మిక.. నా గురించి ఏమైనా మాట్లాడండి కానీ నా కుటుంబాన్ని మధ్యలో మాత్రం లాగకండి అంటూ హెచ్చరించింది. ప్రస్తుతం రష్మిక చేసిన ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
🫰🏻🫶🏻♥️ https://t.co/nQ3W0DYf0K
— Rashmika Mandanna (@iamRashmika) October 26, 2026




