January 12na vidudala Movie:టాలీవుడ్లో 2027 సంక్రాంతి బరిలో చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద సినిమాల హవా ఈసారి మరింత ఎక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా హిట్టు డైరెక్టర్గా పేరు సంపాదించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా కూడా ఈసారి సంక్రాంతి బరిలో ఉండడం గమనార్హం. విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిస్తున్న చిత్రం జనవరి 12 విడుదల. ఇందులో కృతి శెట్టి, కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి విపరీతంగా నవ్విస్తూ అంచనాలను పెంచేస్తున్నారు చిత్ర బృందం.
భారీ ధరకు తెలుగు రాష్ట్రాలలో థియేట్రికల్ రైట్స్..
ప్రస్తుత సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించి ఫిలిం సర్కిల్స్ లలో చర్చించుకునేలా చిత్ర బృందం కూడా పలు రకాల ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. ఇక హిట్టు డైరెక్టర్గా పేరు సంపాదించిన అనిల్ రావిపూడి సినిమా అంటే బయ్యర్లు కూడా కొనడానికి మక్కువ చూపుతున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పైన నిర్మించారు. ఈ సినిమా థియేటర్లోకి రాకముందే ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా భారీ బిజినెస్ చేసినట్లు వినిపిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో థియేట్రికల్ రైట్స్ రూ .100 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు సమాచారం.
ALSO READ:Rashmika mandanna:విడాకుల రూమర్స్ పై.. రష్మిక సంచలన పోస్ట్..!
నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం ఎగబడుతున్న బయ్యర్లు..
విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ కెరియర్ లోని ఇది బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ డీల్ అని పలువురు ట్రేడ్ పండితులు సైతం వెల్లడిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లో అలాగే ఇతర ముఖ్యమైన ప్రాంతాలలో కూడా ఈ సినిమా హక్కుల కోసం బయ్యర్లు భారీగానే పోటీ పడుతున్నారట. అలాగే నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయాయని త్వరలోనే అధికారికంగా చిత్ర బృందం ప్రకటించే అవకాశం ఉన్నట్లు వినిపిస్తోంది. కామెడీ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అనిల్ రావిపూడి సినిమా అంటే కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడి చూస్తారని థియేటర్లకు క్యూ కట్టడం సర్వసాధారణంగా మారిపోయింది.
ALSO READ:Rajasekhar:రాజశేఖర్- శ్రీదేవి పెళ్లి జరగకపోవడానికి కారణం..?
అనిల్ రావిపూడి గత చిత్రాలు..
అనిల్ రావిపూడి గత చిత్రాలు సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు సినిమాలు రెండు బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఇప్పుడు అదే సెంటిమెంట్ ని రిపీట్ చేస్తూ జనవరి 12న విడుదల (January 12na vidudala Movie)సినిమా మరొకసారి బాక్సాఫీస్ వద్ద బరిలో దిగబోతోంది. మొత్తానికి వచ్చే సంక్రాంతికి థియేటర్లో నవ్వులు పండగ పూయడం ఖాయమని అభిమానులు సైతం భావిస్తున్నారు. మరి ఈ సినిమాతో అనిల్ రావిపూడి మరొకసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తారో చూడాలి మరి. ప్రస్తుతం సినిమాకి సంబంధించి పాటలను విడుదల చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ట్రైలర్ విడుదల చేస్తే ఎలాంటి అంచనాలను పెంచేస్తుందో చూడాలి.




