Bollywood :ప్రేమకి, పెళ్ళికి వయసుకు సంబంధం లేకుండా పోతోంది ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఈ విషయాన్ని కాస్త గట్టిగానే ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది. లేటు వయసులో కూడా వివాహం చేసుకున్న సెలబ్రెటీలు అలాగే చిన్న వయసులోనే వివాహం చేసుకున్న సెలబ్రిటీలు కూడా ఉంటున్నారు. మరి కొంతమంది వయసులో తమ కంటే పెద్దవాళ్ళను లేదా చిన్న వాళ్ళను కూడా వివాహం చేసుకున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు అలాంటి హీరోయిన్స్లలో బాలీవుడ్ మలైక అరోరా కూడా ఒకరు. ఈమె వయసు 50 సంవత్సరాలు దాటినప్పటికీ ప్రస్తుతం సింగిల్గానే ఉంటోంది.
మళ్లీ ప్రేమలో పడ్డ మలైకా..
మలైకా అరోరా కెరియర్ లో ఎన్నో బ్రేకప్స్ అవుతున్నప్పటికీ కొత్త బాయ్ ఫ్రెండ్స్ తో అప్పుడప్పుడు చట్టపట్టలేసుకొని తిరుగుతూ కనిపిస్తుంది. గత కొంతకాలంగా యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉందని , కానీ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారని బాలీవుడ్ లో (Bollywood )వార్తలు వినిపించాయి. ఇక వీరిద్దరి మధ్య వయసు తేడా 12 సంవత్సరాలు. ముఖ్యంగా మలైకా అరోరా కంటే అర్జున్ 12 సంవత్సరాలు చిన్నవాడు. మలైకా గతంలో కూడా ప్రముఖ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకోగా 2017లో మనస్పర్ధలు కారణం చేత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే వీరికి కుమారుడు కూడా జన్మించారు.
also read:OTT:ఈ వారం OTTలో విడుదలయ్యే టాప్ సినిమాలు, సిరీస్‌లు ఇవే..!
19 ఏళ్ల చిన్నవాడు..
ఆ తర్వాత అర్జున్ కపూర్ తో మలైకా అరోరా డేటింగ్ ప్రారంభించింది అని , ఆ తర్వాత అది ఎక్కువ కాలం నిలవలేదు.. 2024 లో వీరిద్దరు విడిపోయారని వార్తలు వినిపించాయి . ఇప్పుడు మలైక ఆరోరా తనకంటే 19 సంవత్సరాలు చిన్నవారు అయినా మరో యువకుడితో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. అతని పేరు హర్ష్ మోహతా. ఇతడు ముంబైకి చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపార కుటుంబాలకు సంబంధించిన వ్యక్తి అన్నట్లుగా వినిపిస్తోంది.
also read:Tollywood:టాలీవుడ్‌లో కొత్త చరిత్ర.. తెలుగు హీరోయిన్ల జోరు..!
రూమర్స్ పై స్పందించేది ఎవరు?
మలైకా అరోరా, హర్ష్ మోహతా డేటింగ్ లో ఉన్నట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి అయితే అతడి వయసు 33 సంవత్సరాలని.. మలైకా వయసు 52 సంవత్సరాలు .. ఇద్దరు కలిసి విమానాశ్రయంలో కలిసి కనిపించడమే కాకుండా కొన్ని ప్రైవేటు పార్టీలలో కూడా కలిసి కనిపిస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి కొన్ని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలే ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ప్రైవేటు పార్టీకి ఇద్దరు హాజరై సందడి చేయడంతో ఈ డేటింగ్ రూమర్స్ కి మరింత బలాన్ని అందించింది. మరి ఈ విషయం పైన ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి.




