Monday, August 31, 2026
HomeLATESTKavya Kalyan Ram:కీరవాణి ఇంటి కోడలుగా టాలీవుడ్ హీరోయిన్..!

Kavya Kalyan Ram:కీరవాణి ఇంటి కోడలుగా టాలీవుడ్ హీరోయిన్..!

Kavya Kalyan Ram: ప్రముఖ యంగ్ బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ తాజాగా కాలభైరవతో తన ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

on
- Advertisement -banner Ad

Kavya Kalyan Ram:టాలీవుడ్ లో ఇప్పుడు మరో సెలబ్రిటీ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోంది. గత కొద్దిరోజులుగా ప్రముఖ సంగీత దర్శకుడు కాలభైరవ, ప్రముఖ హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ ప్రేమలో ఉన్నారనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. అయితే ఈ విషయం మొదట రూమర్స్ అనుకున్నప్పటికీ ఇప్పుడు తాజాగా ఈ విషయం పైన ఈ జంట క్లారిటీ ఇచ్చారు. తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకోబోతున్నట్లు అఫీషియల్ గా సోషల్ మీడియా ద్వారా ఈ జంట ఫోటోలతో పంచుకున్నారు.

ప్రేమ విషయాన్ని బయటపెట్టిన కావ్య కళ్యాణ్ రామ్ కాలభైరవ..

తాజాగా కాలభైరవ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్టుతో తమ బంధం పైన క్లారిటీ ఇచ్చారు.. కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) తో తనకు ఉన్న బంధాన్ని ఎంతో అందంగా వివరిస్తూ జీవితాంతం ఆమెతో కలిసి ఉండబోతున్నానని తెలిపారు. కావ్య స్వయంగా తన ఇంస్టాగ్రామ్ లో ఇలా రాసుకొస్తూ.. తన జీవితంలోకి సరైన వ్యక్తి వచ్చినప్పుడు ప్రపంచం అంతా ఎంత అందంగా కనిపిస్తుందో అంటూ రాసుకుంది.. మన జీవితంలోకి అడుగు పెట్టాక దేవుడు మనపై ఎంత ప్రేమ చూపిస్తున్నాడో అర్థమవుతుందంటూ కాలభైరవతో ఉన్న ఫోటోలను షేర్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.. ఇద్దరూ కూడా మనిద్దరం జీవితాంతం ఒకే ఇంట్లో ఉంటామనే విషయాన్ని అందరికీ చెప్పడం చాలా ఆనందంగా ఉందంటూ భైరవ, కావ్య ఇద్దరు కూడా ఇంస్టాగ్రామ్ ద్వారా తెలిపారు.

- Advertisement -
Advertisement

also read:Ariyana Glory:హిజ్రాలపై.. అరియాన షాకింగ్ వీడియో..!

కావ్య కళ్యాణ్ రామ్ కెరియర్..

చైల్డ్ యాక్టర్ గా మొదట తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కావ్య కళ్యాణ్ రామ్ .. ఎన్నో చిత్రాలలో నటించింది. హీరోయిన్ గా మసూద, బలగం వంటి చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న కావ్య కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఎన్నో చిత్రాలలో హీరోయిన్గా నటిస్తోంది. ఇక ప్రముఖ సంగీత దర్శకుడుగా పేరు సంపాదించిన ఎం ఎం కీరవాణి కుమారుడే సింగర్ కాలభైరవ. త్వరలోనే తాము వివాహం చేసుకోబోతున్నట్లు ఈ జంట ప్రకటించడంతో అభిమానులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి వివాహ తేదీని అఫీషియల్ గా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

also read:Meena:”అంతా దేవుడి స్క్రిప్ట్”..రెండో పెళ్లి పై మీనా సెన్సేషనల్ కామెంట్స్..!

పెళ్లి తర్వాత సినిమాలకు దూరమవుతుందా?

కావ్య కళ్యాణ్ రామ్ 2001లో స్నేహమంటే ఇదేరా అనే చిత్రంతో పరిచయమయ్యింది . ఆ తర్వాత 2003లో అల్లు అర్జున్ నటించిన గంగోత్రి సినిమాతో మరింత క్రేజ్ సంపాదించుకున్న కావ్య ఠాగూర్ ,అడవి రాముడు ,లేత మనసులు, బాలు, బన్నీ, తదితర చిత్రాలలో చైల్డ్ యాక్టర్ గా నటించింది. ఇక మసూద, బలగం వంటి చిత్రాలలో నటించిన కావ్య ప్రస్తుతం వాట్సాప్ నరేష్ అనే చిత్రంలో నటిస్తోంది. మరి వివాహమనంతరం సినిమాలకు దూరం అవుతుందో లేదో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

 

View this post on Instagram

 

A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram)

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you