Tuesday, September 1, 2026
HomeLATESTKavya Kalyan Ram:శ్రీదేవి, శ్రియారెడ్డి తర్వాత అదే బాటలో కావ్య కళ్యాణ్ రామ్.. అసలు కథ...

Kavya Kalyan Ram:శ్రీదేవి, శ్రియారెడ్డి తర్వాత అదే బాటలో కావ్య కళ్యాణ్ రామ్.. అసలు కథ ఇదే!

Kavya Kalyan Ram:సినీ ఇండస్ట్రీలో బాలనటులుగా పరిచయమై ఆ తర్వాత కథానాయికలుగా ఎదిగిన పలువురు తారలు ఉన్నారు.

on
- Advertisement -banner Ad

Kavya Kalyan Ram:సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు చాలా చాలా కామన్. ఎంతోమంది సెలబ్రిటీస్ ఇలా ప్రేమించి పెళ్లిలు చేస్కున్నారు. ఏదైనా సినిమా షూటింగ్‌లో హీరో–హీరోయిన్, లేదా డైరెక్టర్–హీరోయిన్, లేకపోతే ప్రొడ్యూసర్–హీరోయిన్.. ఇలా ఎవరైనా సరే ప్రేమించి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కువ మంది కలిసి ఉండడం చాలా తక్కువ. టపా టపా అంటూ విడిపోతూ ఉంటారు. కానీ ఇండస్ట్రీలో మాత్రం ప్రేమ పెళ్లిళ్లు అస్సలు ఆగడం లేదు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కొడుకు కాలభైరవ, హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) తమ ప్రేమ విషయాన్ని అఫీషియల్‌గా బయటపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతోంది.

కావ్య కళ్యాణ్ రామ్–కాలభైరవ ప్రేమ :

అంతేకాదు, గతంలో హీరో శ్రీ సింహ కోడూరితో కలిసి ‘ఉస్తాద్’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించిన కావ్య కళ్యాణ్ రామ్.. శ్రీ సింహ ఎవరో కాదు, కీరవాణి చిన్న కొడుకు. కీరవాణి పెద్ద కుమారుడు, మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ. ఇప్పుడు కావ్య కళ్యాణ్ రామ్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడు. దీంతో వీళ్ల వ్యవహారం సోషల్ మీడియాలో బాగా హీట్ పెంచేస్తోంది. సోషల్ మీడియాలో చాలామంది.. ‘తమ్ముడితో నటించి అన్నని ప్రేమలో పడేశావా?’ అంటూ ఘాటుగా మాట్లాడుతున్నారు. అంతేకాదు, గతంలో ఇలా చేసిన హీరోయిన్లకు సంబంధించిన విషయాలను మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.

- Advertisement -
Advertisement

also read:Rashmi Gautam:జబర్దస్త్‌లోకి తిరిగొచ్చిన సుధీర్.. రష్మి రియాక్షన్‌పై సోషల్ మీడియాలో చర్చ!

గతంలోనూ ఇలాంటి ఘటనలు :

తమ్ముడితో నటించి అన్నని పెళ్లి చేసుకోవడం ఇండస్ట్రీలో కావ్య కళ్యాణ్ రామ్ ఫస్ట్ టైమ్ చేసిన పని కాదు. గతంలో చాలామంది చేశారు. ముఖ్యంగా గతంలో అతిలోకసుందరి శ్రీదేవి విషయంలోనూ ఇలాంటి ఆసక్తికరమైన బంధమే ఏర్పడింది.శ్రీదేవి, అనిల్ కపూర్‌తో కలిసి పలు సినిమాల్లో జోడీగా నటించారు.ఆ తర్వాత అనిల్ కపూర్ బ్రదర్ బోనీ కపూర్‌ను లవ్ చేసి, ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. అప్పట్లో వీళ్ల బంధం సోషల్ మీడియాలోనే కాదు, బాలీవుడ్‌లో కూడా సెన్సేషన్‌గా మారింది.

- Advertisement -
Advertisement

also read:Balakrishna:కొడుకు బర్త్‌డేకు సెన్సేషనల్ గిఫ్ట్ రెడీ చేసిన బాలయ్య..!

శ్రియ రెడ్డి విషయంలోనూ..:

ఇక అదే తరహాలో నటి శ్రియ రెడ్డి కూడా చేశారు. శ్రియ రెడ్డి హీరో విశాల్‌తో సినిమాలో నటించారు. అనంతరం విశాల్ సోదరుడైన నిర్మాత విక్రమ్ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఇదే లిస్టులోకి కావ్య కళ్యాణ్ రామ్ కూడా ఎంటర్ అయిపోయింది అంటూ జనాలు ఆటపట్టిస్తున్నారు. ఇలా తమ్ముడితో లేదా అన్నతో నటించి, అదే కుటుంబంలోని మరో వ్యక్తిని వివాహం చేసుకున్న హీరోయిన్ల గురించి సోషల్ మీడియాలో ఇంకా ఆరా తీస్తున్నారు.ప్రస్తుతం కావ్య కళ్యాణ్ రామ్, కాలభైరవ పేర్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you