Wednesday, September 9, 2026
HomeLATESTNandana :నందన కేసులో మరో ట్విస్ట్.. లుక్‌అవుట్ నోటీసుపై పోలీసుల కీలక నిర్ణయం!

Nandana :నందన కేసులో మరో ట్విస్ట్.. లుక్‌అవుట్ నోటీసుపై పోలీసుల కీలక నిర్ణయం!

Nandana:విదేశాల్లో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నందన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

on
- Advertisement -banner Ad

Nandana:యూట్యూబర్ నందన తన “నందూస్ వరల్డ్” యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసాలు స్పాన్సర్ చేస్తామని చెప్పి నిరుద్యోగుల దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నందన ఇప్పుడు పోలీసు విచారణను ఎదుర్కొంటోంది.

ఆమె ఇండియాకు రావడంతో హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై లుక్‌అవుట్ నోటీసులు ఉండటంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ కేసుకు సంబంధించి ఆమెను విచారించారు.

- Advertisement -
Advertisement

మూడు గంటల పాటు పోలీసుల విచారణ :

ఈ కేసు విచారణలో యూట్యూబర్ నందన పోలీసులకు సరిగ్గా సహకరించలేదని తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌లో మధ్యాహ్నం ఒంటిగంటకు విచారణకు హాజరైన నందన దాదాపు మూడు గంటల పాటు పోలీసుల కస్టడీలోనే ఉంది. తన వెంట నలుగురు లాయర్లను కూడా తీసుకువచ్చింది. పోలీసులు మొత్తం 30 నుంచి 40 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అయితే కొన్నింటికి మాత్రమే సమాధానం చెప్పి, మరికొన్నింటికి సమాధానం దాటవేసినట్లు తెలుస్తోంది.

భర్త మధుకర్‌పైనే బాధ్యత :

విచారణ అనంతరం సీఐ మీడియాతో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నందన(Nandana) అడిగిన ప్రశ్నలకు కొన్నింటికి మాత్రమే సమాధానం చెప్పింది. “నేను ఎవరినీ మోసం చేయలేదు. నేను ఏమీ తప్పు చేయలేదు. నేను ఎవరి వద్దా డబ్బులు వసూలు చేయలేదు “అని మాత్రమే సమాధానం చెప్పినట్లు తెలిపారు. మొత్తం తన భర్త మధుకర్‌నే డెస్టినీ కన్సల్టెన్సీ వ్యవహారాలు చూసుకుంటున్నారని, ఆయనకే అన్ని విషయాలు తెలుసని నందన చెప్పినట్లు సీఐ తెలిపారు.

- Advertisement -
Advertisement

also read:Nora fatehi:చిక్కుల్లో పడ్డ నోరా ఫతేహి.. ఏకంగా రూ .3కోట్ల పరువు నష్టం..!

వీసాలు రద్దు కావడంపై నందన వివరణ :

సమయానికి వెళ్లకపోవడం వల్లే వారి వీసాలు రద్దయ్యాయని, అందులో తమ తప్పేమీ లేదని నందన చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రూఫ్‌తో పాటు ఎస్‌ఎంఎస్‌లను కూడా ఆమె పోలీసులకు చూపించినట్లు సీఐ తెలిపారు.అంతేకాదు, ఈ నెల 16న ఆమె, ఆమె భర్త మధుకర్, మామ మోహన్‌రావు ముగ్గురినీ విచారించాలని నోటీసులు ఇచ్చామని సీఐ తెలిపారు.

- Advertisement -
Advertisement

also read:Sushmitha Konidela:బాబాయ్ పవర్ తో మెగా డాటర్ సుస్మితకి కీలక పదవి..!?

లండన్ వెళ్లాల్సి ఉందంటూ నందన వివరణ :

అయితే తాను ఇండియాలో ఉండలేనని, లండన్‌కు తాను వెళ్తే తన భర్త ఇండియాకు వస్తారని నందన చెప్పినట్లు సీఐ తెలిపారు. పిల్లలను ఎవరో ఒకరు చూసుకోవాలని, పిల్లలు ఒంటరిగా ఉండలేరని, తమ పిల్లలను స్కూల్‌కు పంపాలంటే ఇతరుల్లో ఎవరో ఒకరు లండన్‌లో ఉండాల్సి ఉంటుందని ఆమె చెప్పినట్లు తెలిపారు. ఒకేసారి ఇద్దరికీ వెళ్లే అవకాశం లేదని నందన వివరించినట్లు సీఐ పేర్కొన్నారు.

లుక్‌అవుట్ నోటీసు ఎత్తివేయాలని మెయిల్ :

అంతేకాదు, నందన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు మెయిల్ పెట్టినట్లు తెలుస్తోంది. తమపై ఉన్న లుక్‌అవుట్ నోటీసును ఎత్తివేస్తేనే తాము పోలీసుల విచారణకు సహకరిస్తామని ఇబ్రహీంపట్నం సీఐ ఏ. సుబ్రహ్మణ్యంకు మెయిల్ పెట్టినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లుక్‌అవుట్ నోటీసును ఎత్తివేసేది లేదని చెప్పినట్లు తెలుస్తోంది. అయినా సరే సోమవారం హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో నందన ప్రత్యక్షమైంది. ఆమెపై లుక్‌అవుట్ నోటీసు ఉండటంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

నందనపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ :

ఈ వ్యవహారంపై జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు. నందనకు పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉందని, ఆమె వెనుక ఒక పెద్ద బడా పొలిటికల్ నేత ఉన్నారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఆ కారణంగానే ఆమె ఇంత ధీమాగా ఉందని, ఆమెపై ఇలాంటి కేసులు ఉన్నప్పటికీ ఇండియాకు వచ్చిందంటే తన పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌ను చూసుకునే వచ్చిందని కొందరు అంటున్నారు. ఆమె వెంట నలుగురు లాయర్లను తీసుకువచ్చిందంటే ఆమె కామన్ పీపుల్ కాదని, ఆమె వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

డబ్బులు తిరిగి ఇస్తే కేసులు ఎత్తేస్తామంటున్న బాధితులు :

మరికొందరు మాత్రం నందన మా దగ్గర తీసుకున్న డబ్బులు మాకు ఇస్తే చాలని, తాము కేసులు ఎత్తివేస్తామని ఓపెన్‌గానే చెబుతున్నారు. నందన మాత్రం తాను డబ్బులు తీసుకోలేదని, తాను ఎలాంటి మోసం చేయలేదని చెబుతోంది.ఈ వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పడాలంటే నందన నిజాయితీగా నోరు విప్పాల్సిందే. అసలు ఏం జరిగింది? ఎవరి దగ్గర ఎంత డబ్బు తీసుకున్నారు? డెస్టినీ కన్సల్టెన్సీ వ్యవహారాలను ఎవరు నిర్వహించారు? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. అప్పటివరకు ఈ కేసులో అసలు నిజాలు ఏంటనేది వేచి చూడాల్సిందే.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you