Vijay Deverakonda:టాలీవుడ్ లో రౌడీ హీరోగా పేరు సంపాదించిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఎపిక్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చి కీలకమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనంగా మారాయి. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) మాట్లాడుతూ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఎవరైనా ఎదురొస్తే తాను చూసుకుంటానని 100% ఎవరిని కూడా అతని జోలికి రాకుండా చూసుకుంటానంటూ విజయ్ ఓపెన్ గానే భరోసా ఇచ్చారు.
వారి జోలికొస్తే తాటతీస్తా – విజయ్ దేవరకొండ
తరుణ్ భాస్కర్, నాగి, ఆదిత్య, సందీప్ రెడ్డి వంగావంటి వారంతా తన మనుషులే అని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని కూడా తెలియజేశారు. తెలుగు సినీ పరిశ్రమకు ఇది అద్భుతమైన సంవత్సరం అని, రాబోయే సినిమాలన్నీ కూడా బ్లాక్ బాస్టర్ అవుతాయని విజయ్ ధీమాతో తెలిపారు. సెప్టెంబర్ 11 ఆనంద్ ఎపిక్ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్, రాహుల్ సంకృత్యాన్ , రణబాలి, రష్మిక ది మైసా, తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది అలాగే డిసెంబర్లో ఫౌజీ, బాలయ్య దాదా, నాగార్జున కింగ్ 100 సినిమాలు వరుసగా రాబోతున్నాయని తెలియజేశారు. ఇందులో దాదాపుగా నాలుగు చిత్రాల కంటెంట్ తనకి బాగా తెలుసని.. ఇదొక ఆపరేషన్ TFI అని 100% స్ట్రైక్ గ్రేడ్ తో బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా హిట్టు కొట్టబోతున్నామంటూ విజయ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.
also read:Anand Deverakonda:”వైష్ణవి చైతన్యతో లవ్”..ఆనంద్ దేవరకొండ సెన్సేషనల్ కామెంట్స్..!
వారి వల్లే ఇండస్ట్రీలో హిట్స్..
ప్రస్తుతం ఇండస్ట్రీలో డైరెక్టర్లు హీరోల కాంబినేషన్ తో పాటు రైటింగ్ స్కిల్స్ కూడా పెరిగాయని కానీ టెక్నికల్ టీమ్స్ సరైన సెటప్ ఎఫీషియన్స్ లేకపోవడం వల్లే కొన్ని సినిమాలు ఆలస్యం అవుతున్నాయి అంటూ విజయ్ దేవరకొండ తెలిపారు. సినీ పరిశ్రమలో కేవలం 20 నుంచి 30% మాత్రమే స్కిల్ పీపుల్స్ ఉన్నారని, మిగతా వారంతా కూడా అన్ స్కిల్డ్ సెక్టార్గా మారింది అంటూ విమర్శలు చేశారు. ఫిలిం స్కూల్ నుంచి వచ్చే కొత్త బ్యాచులతోనే ఇండస్ట్రీ ముందుకు వెళుతుందంటూ విజయ్ దేవరకొండ విశ్లేషించారు.
also read:Varanasi Movie: గూస్ బంప్స్ తెప్పిస్తున్న మహేశ్ బాబు ఫైట్ సీన్స్ (వీడియో)!
తమ్ముడి గురించి స్పెషల్ మూమెంట్స్ షేర్..
అలాగే ఆనంద దేవరకొండ తో తనకున్న చిన్నపాటి జ్ఞాపకాలను పంచుకొని విజయ్ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. పుట్టపర్తిలో తనను మొదటిసారి హాస్టల్ లో వదిలిపెట్టేందుకు వెళ్ళినప్పుడు ఆనంద్ కూడా తనతో పాటే ఉంటానని చాలా ఏడ్చేవారని గుర్తు చేసుకున్నారు. థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు కూడా ఆనంద్ తన క్లాస్ రూమ్ డోర్ వెనకలే దాక్కొని ఉండేవారని, అమెరికాకు వెళ్లేటప్పుడు కూడా ఎన్నో భయాలు ఉన్న ఆనంద్ ఇప్పుడు తనకంటూ ఒక సొంతదారిని క్రియేట్ చేసుకోవడం తనకి చాలా గర్వంగా ఉందంటూ విజయ్ తెలిపారు.




