Wednesday, September 9, 2026
HomeLATESTAnand Deverakonda:"వైష్ణవి చైతన్యతో లవ్"..ఆనంద్ దేవరకొండ సెన్సేషనల్ కామెంట్స్..!

Anand Deverakonda:”వైష్ణవి చైతన్యతో లవ్”..ఆనంద్ దేవరకొండ సెన్సేషనల్ కామెంట్స్..!

Anand Deverakonda:హీరో ఆనంద్ దేవరకొండ, నటి వైష్ణవి చైతన్య మధ్య ఉన్న అనుబంధంపై మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

on
- Advertisement -banner Ad

Anand Deverakonda:ఆనంద్ దేవరకొండ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోనే కాకుండా, హీరో విజయ్ దేవరకొండ బ్రదర్‌గా కూడా ఆనంద్ దేవరకొండ అందరికీ సుపరిచితమే. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడానికి బాగా కష్టపడుతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలను ఎంచుకుని చేసుకుంటూ తనలోని టాలెంట్‌ను బయటపెడుతున్నాడు.

మరోసారి జోడీగా ఆనంద్, వైష్ణవి :

రీసెంట్‌గా ఆయన నటించిన సినిమాలో హీరోయిన్‌గా యూట్యూబర్ వైష్ణవి చైతన్య నటించింది. ఆల్రెడీ ‘బేబీ’ సినిమాతో హిట్ పేరుగా టాక్ సంపాదించుకున్న వీళ్లిద్దరూ కలిసి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉండడంతో ఈ సినిమాపై జనాలు హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. పైగా ఈ సినిమాలో అక్కడక్కడ కొంచెం బోల్డ్ కంటెంట్ ఉండడంతో, వీళ్లిద్దరి కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అవ్వడంతో వీళ్లిద్దరికి సంబంధించిన కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్నాయి.

- Advertisement -
Advertisement

ప్రేమించుకుంటున్నారంటూ రూమర్స్ :

హీరో ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda), హీరోయిన్ వైష్ణవి చైతన్య ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం బాగా ఊపందుకుంది. ఈ సినిమా షూటింగ్ టైం నుంచే వీళ్లకు సంబంధించిన రూమర్స్ బాగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనిపై ఇద్దరూ ఎప్పటికప్పుడు ‘మా మధ్య అలాంటి స్నేహం అలాంటిదేమీ లేదు’ అంటూ చెబుతూనే ఉన్నారు.

also read:Varanasi Movie: గూస్ బంప్స్ తెప్పిస్తున్న మహేశ్ బాబు ఫైట్ సీన్స్ (వీడియో)!

- Advertisement -
Advertisement

రూమర్స్‌పై ఆనంద్ దేవరకొండ క్లారిటీ :

తాజాగా ఇదే విషయంపై ఆనంద్ దేవరకొండను ప్రశ్నించగా, ఆయన ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ‘మీకు హీరోయిన్ వైష్ణవి చైతన్యకి మధ్య ఏదో సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు?’ అని యాంకర్ ప్రశ్నించగా..

‘అలాంటిదేమీ లేదు. మేము కేవలం ఫ్రెండ్స్. జస్ట్ ఫ్రెండ్స్ అంతే. మా ఫ్రెండ్‌షిప్ ఎప్పటికీ ఇలానే ఉంటుంది. మేబీ మా మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి ఇలాంటి రూమర్స్ వచ్చి ఉండొచ్చు. అవి కేవలం రూమర్సే. నేను, వైష్ణవి ఎప్పటికీ మంచి స్నేహితులుగానే ఉంటాం’ అంటూ చెప్పుకొచ్చారు.దీంతో సోషల్ మీడియాలో ఆయన ఇచ్చిన ఆన్సర్ బాగా వైరల్‌గా మారింది.

- Advertisement -
Advertisement

also read:Bigg Boss 10:రెండో రోజే బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ.. రోహిత్‌పై వర్షిణి సంచలన వ్యాఖ్యలు!

విజయ్ దేవరకొండ పేరుతో నెటిజన్ల కౌంటర్స్ :

అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం.. ‘గతంలో చాలా మంది ఇలానే అన్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీ బ్రదర్ విజయ్ దేవరకొండ అని, రష్మికతో కేవలం ఫ్రెండ్‌షిప్, ఫ్రెండ్‌షిప్ అంటూ పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చాడని కామెంట్లు చేస్తున్నారు. ‘నువ్వు కూడా అలాగే ఫ్యూచర్‌లో వైష్ణవి చైతన్యను పెళ్లి చేసుకుని షాక్ ఇస్తావేమో’ అంటూ ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆనంద్ దేవరకొండ, అదే విధంగా వైష్ణవి చైతన్య పేర్లు బాగా వైరల్ అవుతున్నాయి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you