TV:బుల్లితెర ప్రేక్షకులకు రోజంతా వినోదానికి కొరత ఉండదు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వివిధ ఛానెల్స్‌లో సినిమాలు, సీరియల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలు ప్రసారం అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో ఉండే వారికి టీవీ మంచి టైమ్‌పాస్‌గా మారింది. ఈ నేపథ్యంలో బుధవారం తెలుగు టీవీ(TV) ఛానెల్స్‌లో ప్రసారం కానున్న సినిమాల వివరాలు ఓసారి చూద్దాం.
డీడీ యాదగిరి, ఈటీవీ ప్లస్‌లో :
డీడీ యాదగిరి ఛానెల్‌లో ఉదయం 9 గంటలకు “13 మినిట్స్” హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ సినిమా ప్రసారం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు “కృష్ణ గారడి”, రాత్రి 9:30 గంటలకు “ప్రేమ కిరీటం” ప్రేక్షకులను అలరించనున్నాయి.
ఈటీవీ ప్లస్‌లో మధ్యాహ్నం 3 గంటలకు “మనసుంటే చాలు” సినిమా ప్రసారం కానుంది. ఈటీవీలో ఉదయం 9 గంటలకు, రాత్రి 10:30 గంటలకు “బడ్జెట్ పద్మనాభం” సినిమాను చూడొచ్చు.
also read:Nandana :నందన కేసులో మరో ట్విస్ట్.. లుక్‌అవుట్ నోటీసుపై పోలీసుల కీలక నిర్ణయం!
ఈటీవీ సినిమాలో వరుస చిత్రాలు :
ఈటీవీ సినిమా ఛానెల్‌లో ఉదయం 7 గంటలకు “రావణుడే రాముడైతే”, ఉదయం 10 గంటలకు “మహామంత్రి తిమ్మరుసు”, మధ్యాహ్నం 1 గంటకు “అబ్బాయిగారు” ప్రసారం కానున్నాయి.
సాయంత్రం 4 గంటలకు “మహాకవి కాళోజీ”, సాయంత్రం 7 గంటలకు “దసరా బుల్లోడు”, రాత్రి 10 గంటలకు “సాంబయ్య” సినిమాలు రానున్నాయి. అర్ధరాత్రి 1 గంటకు “రావణుడే రాముడైతే” చిత్రాన్ని మరోసారి ప్రసారం చేయనున్నారు.
also read:Nora fatehi:చిక్కుల్లో పడ్డ నోరా ఫతేహి.. ఏకంగా రూ .3కోట్ల పరువు నష్టం..!
జెమినీ ఛానెల్స్‌లో :
జెమినీ లైఫ్‌లో ఉదయం 11 గంటలకు “ప్రేమకు స్వాగతం”, సాయంత్రం 4:30 గంటలకు “ఫ్రెండ్స్ బుక్” ప్రసారం కానున్నాయి. జెమినీ టీవీలో ఉదయం 9 గంటలకు “కరెంట్ తీగ”, మధ్యాహ్నం 3 గంటలకు “మీటర్” సినిమాలు వస్తాయి.
జెమినీ మూవీస్‌లో అర్ధరాత్రి 1:30 గంటలకు “అమరశిల్పి జక్కన్న”, ఉదయం 4:30 గంటలకు “యువ”, ఉదయం 7 గంటలకు “టూ టౌన్ రౌడీ”, ఉదయం 10 గంటలకు “ఖుషీ ఖుషీగా”, మధ్యాహ్నం 1 గంటకు “లేత మనసులు” ప్రసారం కానున్నాయి.
సాయంత్రం 4 గంటలకు “అమ్మోరు”, 7 గంటలకు “నా అల్లుడు”, రాత్రి 10 గంటలకు “సూర్య పుత్రుడు” సినిమాలు ప్రసారం అవుతాయి.
జీ తెలుగు, జీ సినిమాలు :
జీ తెలుగులో ఉదయం 9 గంటలకు “చింతకాయల రవి” ప్రసారం కానుంది.
జీ సినిమాలు ఛానెల్‌లో ఉదయం 7 గంటలకు “ఐడెంటిటీ”, 9 గంటలకు “నీకు నేను నాకు నువ్వు”, మధ్యాహ్నం 12 గంటలకు “మిడిల్ క్లాస్”, 3 గంటలకు “ప్రేమ విమానం”, సాయంత్రం 6 గంటలకు “రాబిన్ హుడ్”, రాత్రి 9 గంటలకు “ధీరుడు” సినిమాలు రానున్నాయి.
స్టార్ మా ఛానెల్స్‌లో:
స్టార్ మా ఛానల్‌లో సినీ ప్రేక్షకులకు వినోదం అందించేలా పలు సినిమాలు ప్రసారం కానున్నాయి. అర్ధరాత్రి 1:30 గంటలకు “24”, ఉదయం 4 గంటలకు “జనతా గ్యారేజ్”, రాత్రి 9 గంటలకు “క్రాక్” చిత్రాలు టెలికాస్ట్ కానున్నాయి. ఆయా సమయాల్లో ప్రేక్షకులు ఈ సినిమాలను వీక్షించవచ్చు.
స్టార్ మా మూవీస్‌లో ఉదయం 3 గంటలకు “సింహమంటి చిన్నోడు”, 7 గంటలకు “శ్రీదేవి శోభన్ బాబు”, 9 గంటలకు “లవ్ గురు”, మధ్యాహ్నం 12 గంటలకు “వీరసింహారెడ్డి”, 3 గంటలకు “బాక్”, సాయంత్రం 6 గంటలకు “కుబేర”, రాత్రి 9:30 గంటలకు “డాకు మహారాజ్” సినిమాలు ప్రసారం కానున్నాయి.
స్టార్ మా గోల్డ్‌లో ఉదయం 2:30 గంటలకు “ఆదర్శవంతుడు”, 5 గంటలకు “సూర్య వర్సెస్ సూర్య”, 8 గంటలకు “కేరింత”, 11 గంటలకు “12th ఫెయిల్”, మధ్యాహ్నం 2:30 గంటలకు “జోష్”, సాయంత్రం 5 గంటలకు “చాణక్య”, రాత్రి 8 గంటలకు “కవచం” సినిమాలు వస్తాయి. రాత్రి 11 గంటలకు “కేరింత”ను రిపీట్‌గా ప్రసారం చేయనున్నారు. మరెందుకు ఆలస్యం హ్యాపీగా మీకు నచ్చిన సినిమా ఏ ఛానెల్ లో వస్తుందో చూసి ఎంజాయ్ చేయండి.




