ప్రముఖ హీరోయిన్ అందాల తార సమంత గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతోనే కాదు నటనతో కూడా ఆకట్టుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మొదటి భర్త నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈమె.. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరును రెండవ వివాహం చేసుకుంది.
ఒకవైపు నిర్మాతగా మారి శుభం అనే సినిమాను నిర్మించి మంచి సక్సెస్ అందుకున్న ఈమె.. అదే బ్యానర్ పై మా ఇంటి బంగారం అనే సినిమాను నిర్మించడమే కాకుండా అందులో లీడ్ రోల్ పోషించి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో తాను ప్రెగ్నెంట్ అంటూ బహిరంగంగా చెప్పిన ఈమె.. మొదటి బిడ్డ రాక కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
ఇకపోతే నెలలు దగ్గర పడుతుండడంతో సమంతకు ఘనంగా సీమంతం వేడుకలు జరిగాయి ముఖ్యంగా ఈమె భర్త రాజ్ నిడిమోరు , ఈమె స్నేహితురాలు శిల్పారెడ్డి తోపాటు మరికొంతమంది కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ సీమంతపు వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ముఖ్యంగా సమంత , రాజ్ పెళ్లి ఎక్కడైతే జరిగిందో అక్కడే ఈ సీమంతం వేడుకలు కూడా ఘనంగా జరగడం గమనార్హం. కోయంబత్తూర్ లోని సద్గురు ఈషా ఫౌండేషన్ సమీపంలో ఉన్న లింగ భైరవి ఆలయంలోనే ఈ సీమంతపు వేడుకలు జరిగాయి.