అందాల తార, అభినయ సుందరి నిధి అగర్వాల్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ చిన్నది ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అలరిస్తోంది.
నిత్యం రోజుకు ఒక ఫోటో షూట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె తాజాగా పట్టుచీరలో కనిపించి మెస్మరైజ్ చేసింది..
పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో డిజైన్ చేసిన పట్టుచీర ధరించిన ఈమె.. ఈ పట్టు చీరలో తన అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
ఓరచూపుతో కొంటెగా కవ్విస్తూ.. నిధి అగర్వాల్ షేర్ చేసిన ఫోటోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
నిధి అగర్వాల్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు అందంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ఏడాది ది రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె మరోవైపు వరుస సినిమాలలో నటిస్తోంది. కానీ స్టార్ స్టేటస్ లభించలేదు.