Rajamouli:మనందరికీ తెలిసిందే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళితో సినిమా చేయడమనేది అంత ఈజీ విషయం కాదు. ఆఫ్కోర్స్.. ఆయనతో సినిమా చేస్తే ఖచ్చితంగా హిట్ పడుతుంది. కానీ ఆయనతో సినిమా చేయాలి అంటే ఆ సినిమాలో వర్క్ చేసే నటీనటులు, హీరో హీరోయిన్లు కచ్చితంగా కొన్ని కండిషన్స్ పాటించాలి.
ఆయనతో సినిమా కమిట్ అయ్యారు అంటే ఆ సినిమా కంప్లీట్ అయ్యే వరకు వేరే ఏ సినిమాలో కూడా నటించకూడదు, కాల్షీట్స్ ఇవ్వకూడదు. అంతేకాదు.. ఆయన చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఆయన చెప్పిన డైట్ ఫాలో అవ్వాలి. ఆయన చెప్పిన విధంగానే సోషల్ మీడియా హ్యాండిల్స్ చేయాలి. ఇలాంటివన్నీ ఉంటాయి.
రాజమౌళి రూల్స్‌కు హీరోల కమిట్మెంట్ :
ఇది చాలామంది స్టార్స్ బయటపెట్టారు. కానీ రాజమౌళికి (Rajamouli)ఉన్న వర్క్ డెడికేషన్‌తో ఆయన చేసే సినిమాలు హిట్ అవుతాయి అన్న నమ్మకంతో చాలామంది హీరోలు అందుకు కమిట్మెంట్ ఇస్తూ ఉంటారు. కానీ ఓ హీరో విషయంలో మాత్రం రాజమౌళి పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ‘వారణాసి’ షూటింగ్లో రాజమౌళి :
ప్రస్తుతం రాజమౌళి ‘వారణాసి’ సినిమా షూట్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. విలన్ క్యారెక్టర్లో మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ నటిస్తున్నారు. ‘వారణాసి’ చిత్రంలో “కుంభ” అనే అత్యంత శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో ఆయన కనిపించనున్నారు.
ALSO READ:Suriya:20 ఏళ్ల ప్రేమకు మరోసారి కొత్త ప్రమాణాలు.. సూర్య–జ్యోతిక స్పెషల్ వెడ్డింగ్!
పృథ్వీరాజ్ విషయంలో మారిన రూల్స్? :
సాధారణంగా రాజమౌళి సినిమాలో నటించే ఏ నటీనటులైనా సరే పక్క సినిమాలో నటించకూడదు. కానీ రాజమౌళి రూల్స్‌లో ఒక్కసారి చేంజెస్ వచ్చినట్లు తెలుస్తోంది. ‘వారణాసి’ ప్రాజెక్టు ప్రీ-ప్రొడక్షన్ పనులు, వర్క్‌షాప్‌లు, అదేవిధంగా షూటింగ్ షెడ్యూల్ మధ్య వచ్చిన గ్యాప్‌లను పృథ్వీరాజ్ సుకుమార్ చాలా సమర్థవంతంగా వినియోగించుకున్నారని చెప్పాలి. ఈ గ్యాప్‌లో ఆయన ఏకంగా తొమ్మిది ప్రాజెక్టులను పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నారు.
ALSO READ:Nidhhi Agarwal: పట్టుచీరలో పుత్తడి బొమ్మల ఆకట్టుకుంటున్న నిధి అగర్వాల్!
ఒకేసారి మూడు బాధ్యతలు :
అద్భుతమైన ప్లానింగ్‌తో, తన మైండ్ స్ట్రాటజీలను ఉపయోగించి ఒకపక్క హీరోగా, మరొకపక్క దర్శకుడిగా, ఇంకొకపక్క నిర్మాతగా సినిమాలను పూర్తి చేస్తూ సినీ ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. రాజమౌళి సినిమాలో వర్క్ చేస్తూ కూడా 9 ప్రాజెక్టులను కంప్లీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది కచ్చితంగా పృథ్వీరాజ్ సుకుమార్ టాలెంట్ అంటున్నారు.
పృథ్వీరాజ్‌పై ప్రశంసల వర్షం :
ఇప్పటివరకు రాజమౌళితో వర్క్ చేసిన ఏ నటుడు కూడా ఇలాంటి క్రేజీ రికార్డ్ క్రియేట్ చేయలేదని, ఆ ఘనత పృథ్వీరాజ్ సుకుమార్‌కే దక్కిందంటూ శభాష్ అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒకపక్క రాజమౌళి సృష్టించే ‘వారణాసి’ విశ్వంలో కుంభగా భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటూనే, ఇంకొకపక్క తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పనులు, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌ను చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేశారంటూ సోషల్ మీడియా వేదికగా పృథ్వీరాజ్ సుకుమార్‌ను అభిమానులు పొగిడేస్తున్నారు.




