Monday, October 19, 2026
HomeLATESTUday Bhanu:నా భర్త అలాంటి వ్యక్తి.. ఉదయభాను సెన్సేషనల్ కామెంట్స్ వైరల్!

Uday Bhanu:నా భర్త అలాంటి వ్యక్తి.. ఉదయభాను సెన్సేషనల్ కామెంట్స్ వైరల్!

Uday Bhanu:తనకు కావాల్సినంత ప్రేమను భర్త నుంచి పొందుతున్నానని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆయన తనకు అండగా నిలుస్తారని వివరించారు.

on
- Advertisement -banner Ad

Uday Bhanu:తెలుగు బుల్లితెరపై ఒకప్పుడు తనదైన యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న వారిలో ఉదయభాను ఒకరు. తన మాటతీరు, చలాకీతనం, ప్రత్యేకమైన శైలితో ఆమె స్టార్ యాంకర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే కొంతకాలం తర్వాత టీవీ కార్యక్రమాల్లో ఆమె కనిపించడం తగ్గిపోయింది. అప్పుడప్పుడు కొన్ని షోలు చేసినప్పటికీ, గతంలో ఉన్నంత క్రేజ్ మాత్రం కనిపించలేదు. దీంతో ఉదయభాను మళ్లీ ఎప్పుడు బుల్లితెరపై సందడి చేస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇటీవల ఆమె నటన, యాంకరింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా నిర్మాతగానూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ‘పంచనామా’ అనే వెబ్ సిరీస్‌ను నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాగా, మంచి ఆదరణ అందుకుంది. ఈ నేపథ్యంలో ఉదయభాను వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు మరోసారి చర్చలోకి వచ్చాయి.

- Advertisement -
Advertisement

భర్తపై ప్రేమను వ్యక్తం చేసిన ఉదయభాను:

తాజాగా మీడియాతో మాట్లాడిన ఉదయభాను (Uday Bhanu)తన భర్త విజయేంద్ర మౌళి గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన జీవితంలో ఆయన లభించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. తనకు కావాల్సినంత ప్రేమను భర్త నుంచి పొందుతున్నానని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆయన తనకు అండగా నిలుస్తారని వివరించారు.

“ప్రపంచమంతా ఒక్కటై నా వైపు వేలెత్తి చూపించినా, ఆ వేలును విరిచి నా వెన్నంటే నిలబడే భర్త నాకు దొరికారు” అంటూ తన జీవిత భాగస్వామిపై ఉన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. విజయేంద్ర మౌళి ఎంబీఏలో గోల్డ్ మెడలిస్ట్ అని కూడా ఉదయభాను వెల్లడించారు.

- Advertisement -
Advertisement

also read:Bigg Boss:బిగ్‌బాస్ హౌస్‌లో షాకింగ్ ట్విస్ట్.. షాలినికి బంపర్ ఆఫర్..!

పరిచయం ప్రేమగా మారి.. ఆర్యసమాజ్‌లో పెళ్లి:

ఉదయభాను, విజయేంద్ర మౌళి మధ్య విజయవాడలో పరిచయం ఏర్పడిందట. అప్పట్లో థియేటర్లకు సంబంధించిన పరిచయం క్రమంగా ప్రేమగా మారిందని ఆమె వెల్లడించిన విషయాల ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పరిస్థితులు సర్దుకోవడంతో వారి వైవాహిక జీవితం ముందుకు సాగింది.

- Advertisement -
Advertisement

also read:Naga Chaitanya:వృషకర్మ ఓటీటీ డీల్‌పై భారీ బజ్.. నాగ చైతన్య కెరీర్‌లోనే రికార్డ్!

భర్తే స్నేహితుడు.. తండ్రిలా అండగా ఉంటారు:

తన భర్త తనను ఎంతో బాగా అర్థం చేసుకుంటారని ఉదయభాను చెప్పారు. ఎప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు నవ్వుతారు, ఏ సందర్భాల్లో బాధపడతారు అనే విషయాలను కూడా ఆయన సులభంగా గుర్తిస్తారని తెలిపారు. తనను మానసికంగా ఇబ్బంది పెట్టే విషయాలకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారని వివరించారు.

“ఆయన నాకు భర్త మాత్రమే కాదు.. అంతకుమించిన స్నేహితుడు. తండ్రిలా నన్ను చూసుకుంటారు. నాన్న లేని లోటును తీరుస్తున్నారు” అంటూ భావోద్వేగానికి గురయ్యారు. తన భర్త గురించి గతంలో వచ్చిన పుకార్లను కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదని, తమపై వచ్చే విమర్శలను అర్థం చేసుకుంటూ తనకు అండగా నిలిచారని చెప్పారు.

తన జీవితంలో విజయేంద్ర మౌళి ఉండటం ఒక ఆశీర్వాదంగా భావిస్తున్నానని ఉదయభాను పేర్కొన్నారు. ప్రతి అమ్మాయి జీవితంలో ప్రేమను పంచే భర్తతో పాటు, కష్టసుఖాల్లో తోడుండే మంచి స్నేహితుడు కూడా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you