Monday, October 19, 2026
HomeLATESTAakasamlo oka tara:భారీ ధరకు అమ్ముడుపోయిన దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ ఓటీటీ రైట్స్..!

Aakasamlo oka tara:భారీ ధరకు అమ్ముడుపోయిన దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ ఓటీటీ రైట్స్..!

Aakasamlo oka tara: దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

on
- Advertisement -banner Ad

Aakasamlo oka tara:ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే సినిమాపై అంచనాలు పెంచేయాలి అంటే మొదట డైరెక్టర్, హీరో కాంబినేషన్ సెట్ అయ్యిందంటే చాలు.. సినిమా అంచనాలు మొదలవుతాయి. మరికొన్ని సందర్భాలలో పోస్టర్లు లేదా ట్రైలర్, టీజర్ వంటి వాటితో సినిమా పైన అంచనాలు పెంచేయడమే కాకుండా ఓటిటి డీల్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల నిర్మాతలు కొంతమేరకు లాభపడుతూ కూడా ఉంటారు. ఇప్పుడు అలాంటి అద్భుతమే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆకాశంలో ఒక తార(Aakasamlo oka tara) చిత్రానికి లభించింది.

భారీ ధరకు అమ్ముడుపోయిన ఓటీటీ హక్కులు..

ఆకాశంలో ఒక తార చిత్రానికి డైరెక్టర్ పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నారు. మార్కెట్ లెక్కల ప్రకారం విడుదలకు ముందే ఒక సరికొత్త బెంచ్ మార్క్ ను రాబట్టింది.. సినిమా మొదటి దశలోనే ప్రముఖ ఓటీటి సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఫిలింనగర్లో బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆకాశంలో ఒక తార సినిమా విషయంలో కథపై ఉన్న అపారమైన నమ్మకం, దుల్కర్ సల్మాన్ కి ఉన్న క్రేజ్, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థల బలం చూసి ఏకంగా నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను 60 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్లు వినిపిస్తోంది.

- Advertisement -
Advertisement

also read:Neha Sharma:నా ఫోటోలు వీడియోలు వాడితే ఊరుకోను.. రామ్ చరణ్ హీరోయిన్ వార్నింగ్..!

విడుదలకు ముందే సంచలనం..

దీంతో ఆకాశంలో ఒక తార సినిమా విడుదల కాకముందే పూర్తి బడ్జెట్ రికవరీ కావడమే కాకుండా నిర్మాతలకు లాభాల బాట కూడా పట్టేలా చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు థియేట్రికల్ ద్వారా వచ్చే ప్రతి పైసా కూడా నిర్మాతలకు లాభమే అని చెప్పవచ్చు. ఇటీవలే వచ్చిన టీజర్ లో కథ ఏంటో చాలా అద్భుతంగా చూపించారు పవన్ సాదినేని. టీజర్ చూసి కూడా చాలామంది ప్రశంసలు కురిపించారు .ముఖ్యంగా పల్లెటూరి మట్టి వాసన నడుము పెరిగిన ఒక సాధారణ యువతి తన పరిమితులను దాటి అంతరిక్షాన్ని తాకాలనే అసాధారణమైన కల కనడం ఆ సంకల్పానికి అండగా నిలిచే స్నేహితుడు కృష్ణగా దుల్కర్ సల్మాన్ పాత్ర తీర్చిదిద్దిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

- Advertisement -
Advertisement

also read:Uday Bhanu:నా భర్త అలాంటి వ్యక్తి.. ఉదయభాను సెన్సేషనల్ కామెంట్స్ వైరల్!

నవంబర్ 20 న విడుదల..

అలాగే జీవి ప్రకాష్ అందించిన సంగీతం కూడా టీజర్ కి మరింత హైలెట్ గా నిలిచింది. అలాగే ఇందులో శృతిహాసన్ పాత్ర కూడా మరింత హైలెట్గా నిలిచినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోని సినిమా పైన అంచనాలు పెంచేసింది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్, లైట్ బాక్స్ మీడియా వంటి నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని గుండం గంగరాజు కథ స్క్రీన్ ప్లే మూలస్తంభంగా నిలిచాయి.. ఆకాశంలో ఒక తార సినిమాకి కచ్చితంగా జాతీయస్థాయిలో అవార్డులు, రివార్డులు వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ ప్రముఖులు సైతం తెలియజేస్తున్నారు. నవంబర్ 20వ తేదీన తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. మరి ఈ సినిమా ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you