Mamitha Baiju:ఇప్పుడు ఏ భాషలో చూసిన ఎక్కువగా మలయాళ హీరోయిన్స్ ఎక్కువగా వినిపిస్తున్నారు. అలా పాపులారిటీ సంపాదించిన వారిలో హీరోయిన్ మమితా బైజు కూడా ఒకరు. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. ఆ తర్వాత డ్యూడ్, కర, జననాయగన్, విశ్వనాథ్ అండ్ సన్స్, బెత్లెహెమ్ మ్ కుటుంబ యూనిట్ వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది. తాజాగా బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ సినిమా విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మమిత బైజు పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
నన్ను ఆయన ఎలా నమ్మారో అర్థం కావడం లేదు..
మమితా బైజు(Mamitha Baiju) మాట్లాడుతూ..డైరెక్టర్ గిరీష్ ఏడి పై ప్రశంసలు కురిపించింది. తనకు హీరోయిన్గా నటించే సామర్థ్యం ఉందని, తనని నమ్మి గిరీష్ తన పైన ఉంచిన ఆ విశ్వాసమే తనని ఈ స్థాయికి తీసుకువచ్చేలా చేసిందంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడింది.. నన్ను నమ్మడానికి ఆయనకి ధైర్యం ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అంటూ తెలిపింది. సూపర్ శరణ్య సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత వెంటనే గిరీష్ ఏడి నాకు బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ సినిమా కథలోని పాత్రకు తాను సరిపోతానని గిరీష్ భావించారు. ఆ పాత్రను నేను చేస్తే బాగుంటుందని చెప్పారు. ఆయనకు నా పైన ఉన్న నమ్మకం ఎలా కలిగిందో తనకి ఇప్పటికీ అర్థం కాలేదని వెల్లడించింది.
also read:Jailer 2:జైలర్ 2 బాలనటుడి రెమ్యునరేషన్ ఎంతంటే?
డైరెక్టర్ కి ధన్యవాదాలు చెప్పిన మమిత..
అయితే ఈ విషయంలో నాకు ఇప్పటికీ సందేహంగా ఉన్నా.. మెయిన్ హీరోయిన్ పాత్రను నేను చేయగలనని నమ్మారు. అలా ప్రేమలు, బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ లాంటి చిత్రాలలో తనకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఈ విజయోత్సవ కార్యక్రమంలో నిలబడి ఆయనకు చెప్పాలనుకున్నది ఒక్కటే థాంక్యూ అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడింది మమితా బైజు. బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ విజయోత్సవ వేడుకలలో చిత్ర బృందంలోని ప్రతి సభ్యులకి కూడా ఆమె ప్రత్యేకించి మరి ధన్యవాదాలు తెలియజేశారు.
also read:Chiranjeevi:చిరంజీవి ‘కాకా’ సెట్స్ నుంచి వీడియో లీక్.. వింటేజ్ లుక్లో చించేసిన మెగాస్టార్!
వరుస విజయాలతో దూసుకుపోతున్న మమిత..
కెమెరా ముందు నటించిన వారితో పాటు తెర వెనుక కూడా సాంకేతిక నిపుణుల కృషివల్లే సినిమాల సక్సెస్ అవుతాయని ఈ సినిమా విజయానికి ప్రతి ఒక్కరు సహకారం ఉందని తెలిపింది. తన సహనటులకు కూడా ప్రత్యేకించి మరి ఈమె కృతజ్ఞతలు తెలియజేసింది. బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ చిత్రంలో నివీన్ పౌలి, మమితా బైజు ప్రధాన పాత్రలో నటించగా ఈ సినిమా ఆగస్టు 21న థియేటర్లో విడుదల అయ్యి.. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. సుమారుగా ఈ సినిమా 300 కోట్ల రూపాయలకు పైగా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ రాబట్టింది. మమితా బైజు సినీ కెరియర్ విషయానికి వస్తే.. 2016లో పావడ అనే మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఎన్నో చిత్రాలలో నటించింది. ప్రస్తుతం తన చేతిలో ఒక మలయాళం సినిమా రెండు తమిళ సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పటికీ గ్లామర్ ఫోటోలతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.




