Wednesday, October 21, 2026
HomeLATESTTollywood: వివాహ బంధం లోకి అడుగు పెట్టబోతున్న టాలీవుడ్ హీరోస్..!

Tollywood: వివాహ బంధం లోకి అడుగు పెట్టబోతున్న టాలీవుడ్ హీరోస్..!

Tollywood: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ, సాయిధరమ్ తేజ్ వివాహానికి సిద్ధమవుతున్నారు.

on
- Advertisement -banner Ad

Tollywood: టాలీవుడ్లో చాలామంది సెలబ్రిటీలు ఈమధ్య వివాహ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కొంతమంది ప్రేమించి వివాహం చేసుకుంటే.. మరి కొంతమంది పెద్దలు కుదిరిచిన వివాహాన్ని చేసుకుంటున్నారు. మరి కొంతమంది హీరోలు వయసు పెరుగుతున్నా.. ఇంకా వివాహం చేసుకోకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇప్పుడు తాజాగా త్వరలోనే ఇద్దరు టాలీవుడ్ హీరోలు సైతం వివాహం చేసుకోబోతున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఆ టాలీవుడ్ హీరోలు ఎవరు? వారి కాబోయే భార్యలు ఎవరు? అనే విషయం గురించి ఇప్పుడు చూద్దాం.

పెళ్లికి సిద్ధమైన తేజా సజ్జ..

వెండితెర పైన సూపర్ హిట్ చిత్రాలతో మంచి విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్న చైల్డ్ యాక్టర్ హీరో తేజ సజ్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తేజ సజ్జ వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం . నవంబర్లో ఎంగేజ్మెంట్ జరగబోతుందని డిసెంబర్ లో అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఉదయపూర్ లో వివాహం జరగనుంది అని సమాచారం. అయితే ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహమని అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాగా, ఆ కుటుంబానికి సినిమా రంగానికి ఎలాంటి సంబంధం లేదని వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement

నవంబర్లో సాయి ధరంతేజ్ ఎంగేజ్మెంట్..

మరో టాలీవుడ్(Tollywood) హీరో ఎవరంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోగా పేరు సంపాదించిన వారిలో సాయిధరమ్ తేజ్ కూడా ఒకరు. ఈ మెగా హీరో నవంబర్ 5వ తేదీన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు సమాచారం. ఎంగేజ్మెంట్ అయిపోయిన రెండు నెలలకి వివాహం చేసుకోబోతున్నారట. సాయి దుర్గా తేజ్ వివాహం చేసుకోబోయే అమ్మాయి తన చైల్డ్ హుడ్ ఫ్రెండ్ అని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ ఇద్దరు హీరోలు సైతం ఇలా వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారని తెలిసి అభిమానులు కూడా ఆనందపడుతున్నారు. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉంది అనే విషయం తెలియాలి అంటే వీరి కుటుంబ సభ్యులు కానీ హీరోలు కానీ ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంటుంది.

also read:Tammareddy Bharadwaj :”అంత సీన్ అక్కడ లేదు”..ప్రభాస్‌పై తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు..!

- Advertisement -
Advertisement

తేజ సజ్జా సినిమాలు..

తేజ సజ్జా సినిమాల విషయానికొస్తే.. చివరిగా 2025న మీరాయి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. హీరోగా బాగా సక్సెస్ అవుతున్న తేజ సజ్జా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో స్ట్రిమింగ్ అవుతున్న ది ట్రోటర్స్ షో కి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం తన చేతిలో జాంబిరెడ్డి నెక్స్ట్ లెవెల్, హనుమాన్ 2 వంటి చిత్రాలు ఉన్నాయి.

also read:Rajinikanth:రజనీకాంత్ vs చిరంజీవి.. ఫ్యాన్స్ మధ్య వార్!

- Advertisement -
Advertisement

సాయి దుర్గా తేజ్ సినీ కెరియర్..

సాయి దుర్గా తేజ్ సినీ కెరియర్ విషయానికి వస్తే.. 2014లో పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో తన సినీ కెరీర్ ని మొదలుపెట్టి.. ఆ తర్వాత సుప్రీమ్, విన్నర్, జవాన్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, చిత్రలహరి, విరూపాక్ష తదితర చిత్రాలలో నటించారు ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you