Prabhas:టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ప్రత్యేకమైన ఫొటో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘స్పిరిట్’ సెట్స్ నుంచి ఈ ఫొటోను షేర్ చేసిన దర్శకుడు.. తనదైన శైలిలో బర్త్‌డే విషెస్ తెలిపారు. అయితే, ఈ ఫొటోలో ప్రభాస్‌తో పాటు కనిపిస్తున్న బాటిల్ ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో సినిమాపై చర్చతో పాటు ఫన్నీ మీమ్స్ కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
స్పెషల్ ఫొటోతో ప్రభాస్‌కు బర్త్‌డే విషెస్ :
అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ప్రత్యేకంగా విష్ చేశారు. ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి పనిచేస్తున్న ‘స్పిరిట్’ సినిమా సెట్స్ నుంచి ఓ ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.
ఈ ఫొటోలో సందీప్ రెడ్డి వంగా చేతిలో ఓ బాటిల్ పట్టుకుని కనిపిస్తుండగా, ప్రభాస్ నవ్వుతూ దాని వైపు చూపిస్తూ ఏదో మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణం ఈ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు దర్శకుడు రాసిన బర్త్‌డే సందేశం అభిమానులను ఆకట్టుకుంటోంది.
also read:Prabhas:ప్రభాస్‌తో సినిమా చేస్తే పెళ్లి చేసుకోకూడదా.. నెటిజన్ల క్రేజీ మీమ్స్!
‘అన్నా.. లెట్స్ పార్టీ’ అంటూ సందీప్ పోస్ట్ :
ప్రభాస్‌ను (Prabhas)ఆప్యాయంగా అన్నా అని పిలుస్తూ సందీప్ రెడ్డి వంగా తన విషెస్ తెలియజేశారు. “అన్నా.. లెట్స్ పార్టీ! ఇవాళ నీ పుట్టినరోజు. పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రభాస్ అన్నా” అంటూ పోస్ట్ చేశారు. ఈ సందేశం ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.
ఇప్పటికే ‘స్పిరిట్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చిన్న అప్డేట్ వచ్చినా అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెట్స్ నుంచి వచ్చిన ఫొటో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
also read:Tollywood News:రెండు సక్సెస్ మీట్ లు జరిగాయి.. కానీ సినిమా మాత్రం సక్సెస్ కాలేదు!
బాటిల్‌పై ఫన్నీ మీమ్స్.. నెటిజన్ల సెటైర్లు:
ఈ ఫొటోలో అందరి దృష్టిని ఆకర్షించిన మరో అంశం బాటిల్. అందులో ఏ బ్రాండ్ ఉందో స్పష్టంగా తెలియకపోవడంతో నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ తాగే బ్రాండ్ బయటకు తెలియకుండా ఉండేందుకే సందీప్ రెడ్డి వంగా బాటిల్‌ను కవర్ చేశారా? అంటూ కొందరు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
మరికొందరు మాత్రం ఆ బ్రాండ్ ఏమిటో అభిమానులకు తెలిస్తే, ప్రభాస్‌ను స్ఫూర్తిగా తీసుకుని అదే బ్రాండ్‌ను ప్రయత్నించే అవకాశం ఉందని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే బాటిల్ వివరాలు కనిపించకుండా జాగ్రత్త పడ్డారేమోనని సెటైర్లు వేస్తున్నారు.
‘స్పిరిట్’పై మరింత పెరిగిన ఆసక్తి :
మొత్తానికి, ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సందీప్ రెడ్డి వంగా షేర్ చేసిన ఈ ఒక్క ఫొటో అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఒకవైపు బర్త్‌డే విషెస్, మరోవైపు ఫన్నీ మీమ్స్‌తో ఈ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇక ‘స్పిరిట్’ నుంచి తదుపరి అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..!!




