Monday, October 26, 2026
HomeLATESTVaranasi:వారణాసి సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Varanasi:వారణాసి సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Varanasi: రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక మూవీ వారణాసి పై రాజమౌళి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

on
- Advertisement -banner Ad

Varanasi:దర్శక ధీరుడు రాజమౌళి , ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం RRR. ఈ సినిమా విడుదలై నాలుగు సంవత్సరాలు కావస్తోంది. బాక్సాఫీస్ వద్ద అందుకున్న విజయం గురించి చెప్పాల్సిన పనిలేదు. గ్లోబల్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడమే కాకుండా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పింది. భారతీయ సినిమాకు ఎన్నో ఏళ్ల ఆస్కార్ కలను కూడా ఈ సినిమా సాధించి పెట్టిందని చెప్పవచ్చు. దీంతో రాజమౌళి నెక్స్ట్ సినిమా కోసం దేశమంతా కూడా ఎదురు చూసింది. మహేష్ బాబుతో కలిసి వారణాసి సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి ఈ సినిమా పైన అంచనాలు పెరిగిపోయాయి.

also read:Anirudh:జోనీతా గాంధీ ఎవరు? అనిరుధ్ తో బంధం ఏంటి..?

- Advertisement -
Advertisement

RRR చిత్రం కంటే చాలా పెద్దది..

వారణాసి(Varanasi) సినిమా అప్డేట్లు ఇస్తూనే మరొకవైపు సినిమా గురించి అంచనాలను పెంచేశారు రాజమౌళి. ఇప్పుడు తాజాగా RRR చిత్రం కంటే చాలా పెద్దది అంటూ రాజమౌళి పేర్కొన్నట్లు తెలుస్తోంది. వారణాసి సినిమా గ్లోబ్ ట్రోటర్ షూటింగ్ చివరి దశకు చేరుకున్నది. వచ్చే యేడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు. ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూనే, మరొకవైపు ప్రమోషన్స్ ను కూడా చిత్ర బృందం మొదలుపెట్టారు. బ్రెజిల్ లో జరిగిన 50వ సావో పాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో రాజమౌళి పాల్గొన్నారు . అక్కడ వారణాసి సినిమా గురించి పలు విషయాలను పంచుకోవడం జరిగింది.

also read:Zombie Reddy 2:జాంబీ రెడ్డి 2 నుంచి దర్శకుడు అవుట్.. కొత్త డైరెక్టర్ ఎవరంటే?

- Advertisement -
Advertisement

తక్కువ సమయంలోనే వారణాసి షూటింగ్ కంప్లీట్..

అక్కడే రాజమౌళి RRR సినిమా కంటే వారణాసి ఆరింతలు పెద్దదని, అయినప్పటికీ దానికంటే తక్కువ రోజుల్లోనే సినిమాని పూర్తి చేసామంటూ రాజమౌళి తెలియజేశారు.. వారణాసి సినిమా కోసం నేను చాలా ఎక్కువ పేపర్ వర్క్ చేశాను. చాలా ప్రిపేర్ గాని షూటింగ్ కి వెళ్లాను.. RRR చిత్రానికి 315 రోజులు షూట్లోనే ఉన్నాము, అంతకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అయిన వారణాసి కేవలం 275 రోజుల్లోనే పూర్తి చేసాము. 40 రోజులపాటు సేవ్ చేసుకున్నామని రాజమౌళి వెల్లడించారు. RRR చిత్రాన్ని ఎక్కువమంది నెట్ ఫ్లిక్ ఓటిటి లో చూశారని తెలిపారు. అందులో తప్పేమీ లేదంటూ కూడా తెలియజేశారు.

వారణాసి తర్వాత హాలీవుడ్ ప్రాజెక్ట్ పై దృష్టి..

ఒక దర్శకుడుగా నా చిత్రాన్ని ప్రేక్షకులు స్క్రీన్ పైనే చూడాలని కోరుకుంటాను. వారణాసి సినిమాని ప్రపంచ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయాలన్నది నా అతిపెద్ద కల అంటూ రాజమౌళి తెలియజేశారు. RRR సినిమాకి గ్లోబల్ స్థాయిలో వచ్చిన పేరు తర్వాత హాలీవుడ్ నుంచి నాకు చాలా ఆఫర్స్ వచ్చాయని తెలిపారు. వారణాసి సినిమా పూర్తి అయిన తర్వాత కచ్చితంగా హాలీవుడ్ ఆఫర్ల గురించి ఆలోచిస్తానంటూ తెలియజేశారు. వారణాసి సినిమా అనేది సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ మైథాలజికల్ అడ్వెంచర్ చిత్రమని ఇందులో లవ్ స్టోరీ తో పాటు తండ్రి కొడుకుల ఎమోషన్ కూడా ఉంటుందని రాజమౌళి వెల్లడించారు. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్, ఎస్ ఎస్ కంచి కథా స్క్రీన్ ప్లే అందించారట. ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందించారు . ఈ చిత్రంలో మహేష్ బాబు కి జోడిగా ప్రియాంక చోప్రా నటించింది. పృధ్విరాజ్ సుకుమారన్ విలన్ గా నటించారు. 2027 ఏప్రిల్ ఏడవ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా చాలా భాషలలో రిలీజ్ చేయబోతున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you