Monday, October 26, 2026
HomeLATESTKGF 3:యశ్ ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్.. కేజీఎఫ్ 3 లేనట్టేనా..?

KGF 3:యశ్ ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్.. కేజీఎఫ్ 3 లేనట్టేనా..?

KGF 3: ప్రశాంత్ నీళ్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కాల్సిన కేజీఎఫ్ 3 అసలు ఉందా అనే అనుమానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వెళ్లవెత్తుతున్నాయి

on
- Advertisement -banner Ad

KGF 3:రాకింగ్ స్టార్ యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను దేశవ్యాప్తంగా గుర్తించేలా చేసిన చిత్రం కేజిఎఫ్. ఈ సినిమాతో వీరి రేంజ్ ఎవరూ ఊహించని స్థాయిలో పెరిగిపోయింది. ఆ తర్వాత కేజిఎఫ్ 2 చిత్రంతో ఒక సెన్సేషనల్ సృష్టించారని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసింది ఈ చిత్రం. చివరిలో కేజిఎఫ్ 3 ఉంటుందంటూ చూపించారు. ఈ సినిమా పైన కూడా అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ అప్పుడప్పుడు కేజిఎఫ్ 3 కు సంబంధించి ఏదో ఒక విషయం వైరల్ గా మారుతూ ఉండేది.

కేజీఎఫ్ 3 ఇప్పట్లో లేనట్టేనా?

కానీ ఇప్పుడు తాజాగా అందుతున్న ప్రకారం కేజీఎఫ్ 3 ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు లేనట్లు కనిపిస్తున్నాయి. కేజిఎఫ్ 2 చిత్రం తర్వాత ప్రభాస్ తో సలార్ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా ఈ సినిమాకి కూడా సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ తో కలిసి డ్రాగన్ సినిమాను మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ ప్రాజెక్టు ముగిసిన వెంటనే హీరో యశ్ తో కలసి కేజిఎఫ్3 మొదలు పెడతారని అభిమానులందరూ భావించారు.

- Advertisement -
Advertisement

also read:Varanasi:వారణాసి సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

సలార్ 2 ప్రకటించడంతో కొత్త అనుమానాలు..

కానీ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సలార్ 2 సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ ప్రకటించడంతో దీంతో ఇప్పట్లో కేజిఎఫ్ 3(KGF 3) చిత్రానికి చోటు లేదని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కే జి ఎఫ్ 2 సినిమా తర్వాత హీరో యశ్ ప్లానింగ్ కాస్త మిస్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. సరైన సినిమా కథల ఎంపికలు చేయకుండా దాదాపుగా నాలుగేళ్ల గ్యాప్ తీసుకొని డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వచ్చిన టాక్సిక్ సినిమా కూడా ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. దీంతో ఇప్పటివరకు ఈ సినిమా ఓటిటి రైట్స్ కూడా కొనలేని పరిస్థితిలో ఉందని వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Anirudh:జోనీతా గాంధీ ఎవరు? అనిరుధ్ తో బంధం ఏంటి..?

కే జి ఎఫ్ 3 అటకెక్కినట్టేనా?

ఇటువంటి సందర్భంలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి కేజిఎఫ్ 3 చేస్తారనుకుంటే.. ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమా అయిపోయిన వెంటనే సలార్ 2 సినిమాకి ప్రశాంత్ నేను ఫిక్స్ అయిపోయారు. దీంతో యశ్ కే జి ఎఫ్ మూడో భాగం అట్టకెక్కినట్టే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆ సినిమా వచ్చినా కూడా ఆ సినిమా రావడానికి సుమారుగా నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్నట్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ తో తీస్తున్న డ్రాగన్ సినిమా ఒక భాగమా లేక రెండవ భాగాలా అనే విషయం ఇంకా క్లారిటీగా చెప్పడం లేదు. సినిమా స్టోరీ బట్టి చూస్తే కచ్చితంగా ఆ సినిమా కూడా రెండు భాగాలుగా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. మరి అసలు విషయం ఏంటన్నది డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you