Tuesday, October 27, 2026
HomeLATESTRajasekhar:రాజశేఖర్- శ్రీదేవి పెళ్లి జరగకపోవడానికి కారణం..?

Rajasekhar:రాజశేఖర్- శ్రీదేవి పెళ్లి జరగకపోవడానికి కారణం..?

Rajasekhar: అతిలోక సుందరి శ్రీదేవితో రాజశేఖర్ పెళ్లి జరగాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఆగిపోయిందట ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు.

on
- Advertisement -banner Ad

Rajasekhar:తెలుగు సినీ ఇండస్ట్రీలో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు సంపాదించిన హీరో రాజశేఖర్ గురించి చెప్పాల్సిన పనిలేదు ఈ మధ్యకాలంలో పలు సినిమాలలో తండ్రి పాత్రలలో కూడా నటిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. 1962 ఫిబ్రవరి 4న రాజశేఖర్ జన్మించారు. ఈయన చెన్నైలో ఎంబిబిఎస్ పూర్తి చేసి సినిమాల పైన మక్కువ ఉండటంతో తన వైద్య వృత్తిని వదిలి 1980 చివరిలో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట విలన్ గా, సపోర్టింగ్ పాత్రలలో నటించిన రాజశేఖర్ ఆ తర్వాత హీరోగా పేరు సంపాదించారు.

శ్రీదేవితో రాజశేఖర్ పెళ్లి..

రాజశేఖర్(Rajasekhar) హీరోగా మారిన తర్వాత యాక్షన్ హీరోగా పేరు సంపాదించారు. అల్లరి ప్రియుడు, అంకుశం, సింహరాశి, మా అన్నయ్య, గోరింటాకు, ఎవడైతే నాకేంటి వంటి చిత్రాలతో తన కెరీర్ లోనే గుర్తుండిపోయేలా పేరు సంపాదించారు. 2017 లో psv గరుడవేగ అనే చిత్రంతో గ్రాండ్గా రీ ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు రాజశేఖర్.. కానీ ఆ తర్వాత నటించిన చిత్రాలు ఏవి కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాయి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజశేఖర్ తన వివాహ బంధం వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.

- Advertisement -
Advertisement

ALSO READ:star heroin:రొమాంటిక్ సీన్ లో హీరోయిన్ లిప్ కొరికేసిన స్టార్ హీరో..రచ్చ రచ్చ..!

ఆగిపోవడం వెనుక అసలు కారణం..

దివంగత హీరోయిన్ శ్రీదేవి మొదట తనను వివాహం చేసుకోవాలని అనుకుందని చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు . హీరో రాజశేఖర్ తండ్రి శ్రీదేవి తండ్రి మంచి స్నేహితులట . వీరి కుటుంబాలు తమిళనాడులోనే ఉండేవారు. శ్రీదేవి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది కానీ రాజశేఖర్ ఇంకా అప్పటికి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేదు. శ్రీదేవి తో పెళ్లిని రాజశేఖర్ తల్లి ఒప్పుకోలేదట. సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయినీ పెళ్లి చేసుకోకూడదని ఆమె రాజశేఖర్ తో కూడా ప్రమాణం చేయించుకుందట. కానీ చివరికి సినీ పరిశ్రమకు చెందిన జీవితను ప్రేమించి వివాహం చేసుకున్నారు రాజశేఖర్.

- Advertisement -
Advertisement

ALSO READ:BIGG BOSS:బిగ్ బాస్ కోసం ఆస్ట్రేలియా ఉద్యోగాన్నే రిస్క్ చేసింది.. షాలినీకి ఊహించని షాక్!

జీవితాంతం వివాహానికి అందుకే ఒప్పుకున్నారా?

1991 వ సంవత్సరంలో రాజశేఖర్ నటించిన మగాడు అనే చిత్రం సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో గాయాలయ్యాయి ఆ సమయంలో జీవిత దగ్గరుండి మరి రాజశేఖర్ కు సేవలు చేయడాన్ని చూసి రాజశేఖర్ తల్లితండ్రులు కూడా వీరి వివాహాన్ని ఒప్పుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. 1991లో జీవిత రాజశేఖర్ వివాహం కాక వీరికి శివాని, శివాత్మిక అనే ఇద్దరు కూతుర్లు జన్మించారు ఇద్దరు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణిస్తున్నారు. శ్రీదేవి ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ను వివాహం చేసుకుంది .అది కూడా రెండవ వివాహం వీరికి కూడా జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ అని ఇద్దరు కూతుర్లు జన్మించారు. వీరిద్దరూ కూడా ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణిస్తున్నారు. శ్రీదేవి 2018లో దుబాయిలో అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you