Monday, October 26, 2026
HomeLATESTRajinikanth:రజనీకాంత్ తో నాలుగోసారి జోడి కట్టనున్న స్టార్ హీరోయిన్!

Rajinikanth:రజనీకాంత్ తో నాలుగోసారి జోడి కట్టనున్న స్టార్ హీరోయిన్!

RAJINIKANTH: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్ సరసన నాలుగోసారి జత కట్టడానికి స్టార్ హీరోయిన్ సిద్ధమైంది..

on
- Advertisement -banner Ad

Rajinikanth:సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవలే జైలర్ 2 చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మ్యూజిక్ తోనే సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తమిళంతో పాటు తెలుగులో కూడా జైలర్2 సినిమా సత్తా చాటుతోంది. తదుపరి సినిమాల విషయాలకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా అభిమానులను మరింత ఆసక్తి పెంచేలా చేస్తోంది. రజనీకాంత్ తాజాగా ధర్మన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి గత కొద్దిరోజులుగా ఏదో ఒక రూమర్ అయితే వినిపిస్తూనే ఉంది.

సూపర్ స్టార్ సరసన మరో ఛాన్స్..

ఇప్పుడు తాజాగా సూపర్ సార్ రజనీకాంత్ కి జోడిగా మరొకసారి నయనతార నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ (Rajinikanth), నయనతార కాంబినేషన్ అంటే టాలీవుడ్, బాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ గా పేరు సంపాదించారు. వీరిద్దరి కలయికలో వచ్చిన ఇప్పటికే చాలా చిత్రాలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఇప్పుడు తాజాగా రాబోతున్న చిత్రం ధర్మన్ లో కూడా వీరిద్దరు మరొకసారి జత కట్టబోతుండడంతో అభిమానులు కూడా ఈ సినిమా పైన భారీగా అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే అధికారికంగా చిత్ర బృందం వెల్లడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

- Advertisement -
Advertisement

also read:vk.naresh:మహేష్ బాబుతో బంధంపై ఇన్నాళ్ల ప్రచారానికి నరేష్ ఫుల్ స్టాప్!

సక్సెస్ గ్యారెంటీ?

గతంలో రజనీకాంత్, నయనతార కాంబినేషన్లో చంద్రముఖి, దర్బార్, అన్నాత్తే వంటి చిత్రాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఈసారి వీరి కాంబినేషన్లో రాబోతున్న నాలుగో సినిమా కాబోతుండడం గమనార్హం. ధర్మన్ చిత్రంలో నయనతార పాత్ర ఎలా ఉండబోతోంది? ఆమె ఎంట్రీ వెనుక కథ ఏంటి? అనే విషయం పూర్తిగా తెలియాల్సి ఉన్నది. ఈ చిత్రాన్ని ప్రముఖ స్టార్ హీరో కమలహాసన్ స్వయంగా నిర్మిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అనిరుధ్ అందిస్తుండడం గమనార్హం.ఈ చిత్రానికి డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఇందులో రజినీకాంత్ ని రా అండ్ రస్టిక్ యాక్షన్ మేకింగ్ స్టైల్ లో చూపించేలా ప్లాన్ చేస్తున్నారట.

- Advertisement -
Advertisement

also read:Ram Pothineni:రామ్ పోతినేని ప్రేమలో పడ్డాడా? భాగ్యశ్రీ పోస్టుతో మొదలైన కొత్త చర్చ!

సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న జైలర్ 2..

సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ మధ్యకాలంలో చాలా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. ఇప్పటికే జైలర్ 2 సినిమాతో సరికొత్త రికార్డులను సృష్టించారు. సినిమా విడుదలైన పది రోజులలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.666 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జైలర్ 2 సినిమా తెలుగులో రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. తెలుగులో రూ.100 కోట్ల మార్కు అందుకున్న మొట్టమొదటి తమిళ చిత్రంగా జైలర్ 2 సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇప్పటివరకు తమిళ ఇండస్ట్రీ నుంచి డబ్బింగ్ అయిన ఏ సినిమా కూడా తెలుగు వర్షన్ లో 100 కోట్లు సాధించలేదు. గతంలో రజనీకాంత్ నటించిన రోబో 2.O చిత్రం కేవలం 90 కోట్లు మాత్రమే సాధించింది , జైలర్ సినిమా మొదటి భాగం 85 కోట్లు రాబట్టింది. ఇప్పుడు జైలర్ 2 చిత్రం 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you