Saturday, October 31, 2026
HomeINTERVIEWSRajeev kanakala:డ్రాగన్ సినిమాపై రాజీవ్ కనకాల హైపెక్కించే కామెంట్స్!

Rajeev kanakala:డ్రాగన్ సినిమాపై రాజీవ్ కనకాల హైపెక్కించే కామెంట్స్!

Rajeev kanakala: ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల ప్రశాంత నీళ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న డ్రాగన్ సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశారు.

on
- Advertisement -banner Ad

Rajeev kanakala:తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో వైవిద్యమైన పాత్రలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు రాజీవ్ కనకాల గురించి చెప్పాల్సిన పనిలేదు. జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం డ్రాగన్. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ బ్యానర్ పైన, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైన భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ అభిమానుల అంచనాలను పెంచేశాయ్. ఇప్పుడు తాజాగా సినీ నటుడు రాజీవ్ కనకాల డ్రాగన్ సినిమా పైన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

డ్రాగన్ మూవీ పై రాజీవ్ కనకాల కామెంట్స్..

డ్రాగన్ సినిమాపై రాజీవ్ కనకాల (Rajeev kanakala)మాట్లాడుతూ.. డ్రాగన్ సినిమా బ్రహ్మాండంగా వస్తోంది.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో కలిసి చేస్తున్న సినిమా ఇది. ఒక అణు బాంబు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఓపెన్ హెయిర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంటూ అభిమానులు రెండు కాలర్లు ఎగరేసేలా డ్రాగన్ సినిమా ఉంటుందంటూ కామెంట్స్ చేశారు. ఇప్పటిదాకా తాను 8 రోజులపాటు సినిమా షూటింగ్లో పాల్గొన్నాను. తన పాత్రకు సంబంధించి షూటింగ్ ఇంకా పెండింగ్ ఉన్నది. మధ్యలో కాస్త ఇబ్బంది వచ్చి ఆగామని, మళ్లీ వచ్చే నెల నుంచి సినిమా షూటింగ్ మొదలవుతుందంటూ తెలిపారు.

- Advertisement -
Advertisement

also read:Pooja Hegde:పూజా హెగ్డే కెరీర్‌లో బిగ్ ట్విస్ట్.. ఇక ఆ సినిమాలపైనే ఆశలన్నీ!

ప్రశాంత్ నీల్ పై రాజీవ్ కనకాల ప్రశంసలు..

అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అద్భుతమైన డైరెక్టర్ అంటూ రాజీవ్ కనకాల ప్రశంసలు కురిపించారు. అతనికి ఏం కావాలో చాలా క్లియర్ గా తెలుసు. టెక్నిక్ ని ఎలా ఉపయోగించాలో కూడా తెలుసు. ఆర్టిస్ట్ నుంచి నటనను ఎలా తెప్పించుకోవాలి కూడా బాగా తెలుసు , ప్రతి విషయాన్ని బ్యూటిఫుల్ గా చెప్పి యాక్టింగ్ చేయించుకుంటారని, డైరెక్టర్ కి కావలసిన క్వాలిటీ కూడా అదే.. ప్రశాంత్ నీల్ లాగా సిచువేషన్ ని శీనుకు తగ్గట్టుగా వివరిస్తే యాక్టింగ్ ఈజీ అయిపోతుందని తెలియజేశారు. ప్రస్తుతం రాజీవ్ కనకాల ఇంటర్వ్యూలో చేసిన ఈ కామెంట్స్ సైతం అభిమానులు తెగ వైరల్ గా చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Adah Sharma:బ్యూటీ సీక్రెట్ బయటపెట్టిన ఆదాశర్మ!

డ్రాగన్ సినిమా కథ..

డ్రాగన్ సినిమా కథ 1960లో గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతంలోని అంతర్జాతీయ అక్రమ వ్యాపారం నేపథ్యంలో సాగుతుంది. ఇందులో ఎన్టీఆర్ లూగర్ అనే ఒక పాత్రలో కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ కెరియర్ లోనే ఎప్పుడు చూడని ఒక మాస్ లుక్కులో ఇందులో కనిపించబోతున్నారు. అన్నీ అనుకూలిస్తే 2027 జూన్ 11న ఈ సినిమా తెలుగు, తమిళ్ ,కన్నడ, మలయాళం లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎన్టీఆర్ కి జోడిగా రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే అనిల్ కపూర్, ఖుష్బూ, బిజు మీనన్ తదితర నటీనటులు ఇందులో నటిస్తున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you