Sunday, November 1, 2026
HomeLATESTPawan Kalyan:పవన్ కళ్యాణ్- దిల్ రాజ్ కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ..

Pawan Kalyan:పవన్ కళ్యాణ్- దిల్ రాజ్ కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ..

Pawan Kalyan: దిల్ రాజు నిర్మాణంలో పవన్ కళ్యాణ్ కొత్త మూవీ రాబోతున్నట్లు సమాచారం. పైగా ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

on
- Advertisement -banner Ad

Pawan Kalyan:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించిన దిల్ రాజ్ కాంబినేషన్లో గత కొంతకాలంగా భారీ ప్రాజెక్టు రాబోతోందనే విధంగా వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు మరొకసారి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. అదేమిటంటే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వకీల్ సాబ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరొకసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతోందని, అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని పూర్తిస్థాయిలో తెరకెక్కించబోతున్నారు.

పవన్ కళ్యాణ్ – దిల్ రాజు కాంబినేషన్లో కొత్త మూవీ..

ఈ చిత్రానికి సంబంధించి తెలుగు సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. దిల్ రాజు ఇప్పటికే అర్జున అనే ఒక టైటిల్ ను కూడా రిజిస్ట్రేషన్ చేయించినట్లు వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగానే ఈ టైటిల్ సరిపోతుందని చిత్ర బృందం కూడా భావిస్తోందట. ముఖ్యంగా మహాభారతంలోని అర్జునుడు లాగే ఇందులో కూడా హీరో క్యారెక్టర్ ఒక బలమైన లక్ష్యంతో ఉండే పాత్ర అని, అసాధారణ పోరాటం యోధుడిగా కనిపించబోతున్నారని, ఈ పేరును పరిశీలించినట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Irumudi Movie:రవితేజ ఇరుముడి సినిమా నిర్మాతలకు నోటీసులు..!

కథలో ఎంపిక విషయంలో దిల్ రాజు పక్కా ప్లానింగ్..

గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న దిల్ రాజు కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన సల్మాన్ ఖాన్ తో ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పనులు పూర్తి అయిన వెంటనే పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ ని సెట్స్ మీదికి తీసుకు వెళ్లేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ప్రాజెక్టుకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. కథకు సంబంధించి తుది సన్నాహాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. అన్ని భాష ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా భారీ బడ్జెట్ తో యాక్షన్ డ్రామా చిత్రంగా డిజైన్ చేసినట్లు సమాచారం.

- Advertisement -
Advertisement

also read:Rakul Preet Singh:”తెలుగు సినిమాలు అందుకే చేయట్ల”.. రకుల్ సెన్సేషనల్ కామెంట్స్!

ఆఫీషియల్ గా ఎప్పుడు ప్రకటిస్తారు?

ప్రస్తుతం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పొలిటికల్ పరంగా బిజీగా ఉండడంతో ఆయన షెడ్యూల్ క్లియర్ అయిన వెంటనే చిత్ర బృందం నుంచి ఈ అర్జున ప్రాజెక్టు అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ విషయం పైన ఎవరు అఫీషియల్ గా ప్రకటిస్తారో చూడాలి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ అర్జున అనే టైటిల్ ఖరార్ అయితే మాత్రం ఖచ్చితంగా థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంటుందని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చివరిగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తదుపరి సినిమా డైరెక్టర్ సుజిత్ తో ఓజి 2 సినిమాని అఫీషియల్ గా ప్రకటించారు. మరి ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి మరి. ప్రస్తుతం పొలిటికల్ పరంగా పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడం చేత సినిమా షూటింగ్లో ఆలస్యం అవుతున్నట్లు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you