RC 17:టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్, పెద్ది సినిమా తర్వాత ఏ సినిమా చేస్తారు అనే విషయంపై అందరూ ఆసక్తికరంగా ఎదురు చూశారు. అందరూ అనుకున్నట్టుగానే సక్సెస్ఫుల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తన 17వ సినిమాలో నటించబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన రంగస్థలం సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచింది.
RC 17 పూజా కార్యక్రమాలు పూర్తి..
రంగస్థలం సినిమా తర్వాత మరోసారి సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది అని తెలిసి అభిమానులు కూడా ఆనందపడుతున్నారు. తాజాగా RC 17 ప్రాజెక్టు సంబంధించి ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి గడిచిన కొన్ని గంటల క్రితం పూజా కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా ఈ సినిమా నిలుస్తుందని అభిమానుల సైతం అంచనా వేస్తున్నారు. హైదరాబాదులో అత్యంత వైభవంగా ఈ పూజా కార్యక్రమం జరిగింది. ఇందుకు సంబంధించి ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
also read:Bigg Boss Telugu 10:అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..శివాజీ గురించి కౌశల్ షాకింగ్ కామెంట్స్..
సినిమాపై సరికొత్త ఆసక్తి..
ఈ కార్యక్రమానికి నిర్మాతలు హాజరు కావడమే కాకుండా ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. చిత్ర యూనిట్ కి శుభముహూర్తాన క్లాప్ కొట్టి మరి ఈ ప్రాజెక్టును అధికారికంగా లాంచ్ చేశారు. రామ్ చరణ్, సుకుమార్ కలయికలో సినిమా అంటేనే అంచనాలు తారస్థాయికి పెరిగిపోతున్నాయి. రంగస్థలం సినిమాలో చిట్టి బాబు పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా చూపించిన సుకుమార్ అభిమానులు కూడా ఈ పాత్రకి ఫిదా అయ్యారు. RC 17 సినిమా కోసం మాస్టర్ మైండ్ డైరెక్టర్ మరి రామ్ చరణ్ ను ఎలా చూపిస్తారు ? అనే విషయంపై అభిమానులు సర్వత్ర ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ఏదైనా పోస్టర్ విడుదల చేస్తారేమో చూడాలి మరి.
also read:Suriya:సూర్య ‘సీన్’ ట్రైలర్ అదిరిపోయింది.. పోలీస్‌గా సరికొత్త అవతారంలో స్టార్ హీరో!
రికార్డ్స్ సృష్టించడం ఖాయమా?
RC 17 సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి నటీనటుల ఎంపిక వివరాలను త్వరలోనే అధికారికంగా చిత్ర బృందం ప్రకటించనుంది. రామ్ చరణ్ చివరిగా నటించిన పెద్ది సినిమాలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నప్పటికీ చాలామంది పెద్ది సినిమాని ట్రోల్ చేశారు. అయినా కూడా కలెక్షన్స్ పరంగా బాగానే ఆకట్టుకుంది. మరి ఈసారి RC 17 ఎలాంటి రికార్డులను తిరగ రాస్తారో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర, కాకా తదితర చిత్రాల సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఒక టాక్ షోలో కూడా హోస్టుగా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
The journey of #RC17 begins with the MEGA CLAP ❤️
Megastar @KChiruTweets garu sounded the clapboard and blessed the entire team of #RC17 ✨
#YouCanImagine #RC2Sukku
#SRCMega Power Star @AlwaysRamCharan Master Storyteller @aryasukku @MythriOfficial @SukumarWritings #TSeriesFilms @RC17Offl
— #RC17 (@RC17Offl) November 1, 2026




