Renu Desai:ఈ మధ్యకాలంలో చాలా మంది ఎక్కువగా సోషల్ మీడియాకి భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎలాంటి చిన్న విషయం జరిగిన సరే చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అందుకే సెలబ్రిటీలు ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అరచేతిలో సోషల్ మీడియా వచ్చాక ఎవరిపై పడితే వారిపైన బురద చల్లడం చాలా సులువుగా మారిపోయింది. ముఖ్యంగా పబ్లిక్ ఫిగర్స్ వ్యక్తిగత జీవితాలలో కూడా ఏదైనా చిన్నపాటి కుదుపు వస్తే చాలు చాలామంది రెచ్చిపోయి మరి కామెంట్ చేయడమే కాకుండా ట్రోల్స్ చేస్తూ విపరీతంగా బాధకు గురి చేస్తున్నారు
విడాకులు ప్రకటించిన పవన్ కళ్యాణ్..
సోమవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కళ్యాణ్ , తన మూడవ భార్య అన్నా లేజినోవా విడిపోతున్నారని ప్రకటించిన క్రమంలో చాలా నెగెటివిటీ పెరిగిపోయింది. దీంతో కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఎవరూ ఈ విషయం పైన స్పందించకండి అంటూ తమ అధికారిక సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. కానీ కొంతమంది కావాలని ట్రోలింగ్ చేస్తూ ఉండడంతో ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) స్పందించిన తీరు అందరిని ఆకట్టుకుంది.
సోషల్ మీడియా ట్రోల్స్ కి చెక్ పెట్టిన రేణు దేశాయ్..
రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ.. ఒక మనిషి కష్టాలలో ఉన్నప్పుడు వారిని మరింత దూషించడం, విమర్శించడం నైతికంగా ఏమాత్రం కూడా సరైనది కాదు అంటూ తెలిపింది.. అప్పటికి కింద పడిపోయిన బాధలో ఉన్న వారిని మరింత తొక్కేయాలని చూడడం అది రాక్షసత్వం అని, వాళ్లు సమాజంలో ఏ స్థాయిలో ఉన్న వాళ్లు కూడా ఒక మనిషే, ఎవరో ఒకరికి బిడ్డలు .. ఒకరికి తల్లితండ్రులు లేదా తోబుట్టులు అనేవాళ్ళు ఉంటారనే విషయాన్ని మర్చిపోకూడదంటూ ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ వేసింది. అంతేకాకుండా ఈ పోస్టులో రేణు దేశాయ్ వాడిన ఒక వ్యాఖ్య సంచలనంగా మారింది.
మనిషిలా ఆలోచించండి అంటూ ఫైర్..
మనమంతా ఎన్నో లోపాలతో కూడిన గాజు ఇల్లల్లో బతుకుతున్నాము. అలాంటి మనం ఇతరుల ఇళ్ల పైన రాళ్లు విసరడం మానుకోవాలి అంటూ విమర్శలు చేసే వారికి గట్టి కౌంటర్ వేసింది . అంతేకాకుండా తాను పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మాట్లాడితే వచ్చే కామెంట్లను ముందుగానే ఊహించింది.. ఇలా మాట్లాడుతున్నందుకు నాకు ఎలాంటి పేటీఎం డబ్బులు రాలేదని.. సానుభూతి దయ అనేది మనిషికి ఉండవలసిన ప్రాథమిక లక్షణాలు. నా మెదడులో ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ సరిగ్గా పని చేస్తోంది కాబట్టే ఒక మనిషిలా ఇలా స్పందిస్తున్నానని దయచేసి దీనిపైన మీ పనికిమాలిన ఊహాగానాలు మొదలు పెట్టకండి అంటూ తనదైన శైలిలో ఒక పంచ్ వేసింది. పవన్ కళ్యాణ్ తన మూడో భార్య నుంచి విడిపోయిన తర్వాత జరుగుతున్న దాడిని చూసి ఒక తోటి మనిషిగా రేణు దేశాయ్ చేసిన సపోర్టు చూసి చాలామంది అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




