Tuesday, November 10, 2026
HomeLATESTVaranasi Movie:సరికొత్త రికార్డు సృష్టించిన వారణాసి మూవీ..!

Varanasi Movie:సరికొత్త రికార్డు సృష్టించిన వారణాసి మూవీ..!

Varanasi Movie: రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను ప్రముఖ బడా సంస్థ దక్కించుకుంది.

on
- Advertisement -banner Ad

Varanasi Movie:టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న గ్లోబల్ అడ్వెంచర్ చిత్రం వారణాసి. ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటించింది. మలయాళం స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ, ఎస్ ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 7 ,2027న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. వారణాసి సినిమా గురించి ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది.

సినిమా హక్కులు దక్కించుకున్న మైత్రి..

ముఖ్యంగా సినిమా అప్డేట్ల విషయం నుంచి థియేటర్ బిజినెస్ వరకు కూడా ఏదో ఒక ఆసక్తికరమైన వార్త సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు దక్కించుకున్నట్లు వినిపిస్తున్నాయి. ఏకంగా రూ .290 కోట్ల రూపాయల భారీ డీల్ కుదిరినట్లు వినిపిస్తున్నాయి. ఈ డీల్ కి సంబంధించి అటు చిత్ర బృందం కానీ మైత్రి మూవీ మేకర్స్ కానీ ఇంకా అధికారికంగా ప్రకటన చేయవలసి ఉన్నది. ఒకవేళ ఈ ఒప్పందం నిజమైతే రెండు తెలుగు రాష్ట్రాలలో వారణాసి సినిమా థియేట్రికల్ రైట్స్ విషయంలో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది.

- Advertisement -
Advertisement

also read:Hero suriya:పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో..!

తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్న రాజమౌళి..

ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక బిజినెస్ చేసిన చిత్రంగా RRR సినిమా మాత్రమే ఉన్నది. ఈ సినిమా ధియేటర్ రైట్స్ 225 కోట్ల రూపాయలు పలికింది. కానీ ఇప్పుడు వారణాసి సినిమా రైట్స్ కోసం అటు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్, సితార ఎంటర్టైన్మెంట్స్ కూడా పోటీపడ్డాయని, చివరికి మైత్రి మూవీ మేకర్స్ వారు దక్కించుకున్నట్లు వినిపిస్తోంది. రాజమౌళి మహేష్ బాబు మొదటిసారి కలిసి పనిచేయడంతో ఈ సినిమా పైన దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో క్రేజ్ పెరిగిపోయింది.

- Advertisement -
Advertisement

also read:Renu Desai:పవన్ కళ్యాణ్ కి సపోర్టుగా పోస్ట్ చేసిన మాజీ భార్య..!

అంచనాలు పెంచుతున్న మూవీ..

RRR , బాహుబలి చిత్రాల వల్ల రాజమౌళి క్రేజ్ ప్రపంచ దేశాలలో కూడా పెరిగిపోయింది. చాలామంది దర్శకులు సైతం రాజమౌళి పై ప్రశంసలు కూడా కురిపించారు. అందుకే ఇతర దేశాలలో కూడా రాజమౌళి సినిమాలకు మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు. రాజమౌళి సినిమాలలో కథ బలంగా ఉండడం, భారీ స్థాయి నిర్మాణ విలువలు ఉండడం, స్టార్ కాస్ట్ తో నిర్మించడం వల్ల రాజమౌళి సినిమాలు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇప్పుడు వారణాసి(Varanasi Movie) సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో కథను తెరకెక్కించారు. ఈ నేపథ్యంలోని సినిమా థియేట్రికల్ హక్కులకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. అటు రెండు తెలుగు రాష్ట్రాలలో వారణాసి సినిమా రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోవడంతో మహేష్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇప్పటివరకు వారణాసి సినిమాకి సంబంధించి కేవలం గ్లింప్స్, కొన్ని స్టిల్స్ మాత్రమే విడుదలయ్యాయి. దీంతో సినిమాల అప్డేట్ కోసం అభిమానులు మరింత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. నవంబర్లో వారణాసి సినిమా నుంచి ఒక పెద్ద అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you