Tuesday, November 10, 2026
HomeLATESTNayanthara:నయనతార స్టార్ డమ్ పై గట్టి దెబ్బ పడిందా..?

Nayanthara:నయనతార స్టార్ డమ్ పై గట్టి దెబ్బ పడిందా..?

Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన మూకుత్తి అమ్మన్ 2 కలెక్షన్స్ చూసి ఆమె స్టార్ డంపై ఇది గట్టి దెబ్బ కొట్టింది అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Nayanthara:సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించిన నయనతార ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. స్టార్ హీరోలకు సమానంగా నయనతార సినిమాలు రికార్డు సృష్టిస్తూ ఉంటాయి. అందుకే నయనతార కోసం ఎంతటి రెమ్యునరేషన్ అయినా.. ఎంతటి ఖర్చైనా పెట్టడానికి నిర్మాతలు వెనుకాడరు. కానీ ఈ మధ్యకాలంలో ఈమె నటించిన సినిమాలు ఏవి కూడా పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. 2026లో మన శంకర వరప్రసాద్ గారు సినిమా తప్ప మరే సినిమా కూడా పెద్దగా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోతోంది.

కలెక్షన్స్ లో వెనుక బడిపోయిన మూకుత్తి అమ్మన్ 2.

నయనతార(Nayanthara) ప్రధాన పాత్రలో నటించిన డివోషనల్ చిత్రం మూకుత్తి అమ్మన్ 2. ఈ సినిమా తెలుగులో మహాశక్తి అనే పేరుతో దీపావళి కానుకగా భారీ అంచనాల మధ్య విడుదల అయింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలినట్లు వినిపిస్తోంది. కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో విడుదలై న మూకుత్తి అమ్మన్ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఆర్.జే.బాలాజీ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషలలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాకి సీక్వెల్ గా మూకుత్తి అమ్మన్ 2 చిత్రాన్ని డైరెక్టర్ సుందర్ .సి దర్శకత్వం వహించారు.

- Advertisement -
Advertisement

also read:Varanasi Movie:సరికొత్త రికార్డు సృష్టించిన వారణాసి మూవీ..!

నయనతారకి ఘోర అవమానం..

సినిమా అంతా పూర్తయిన తర్వాత ఈ సినిమాని మహాశక్తిగా మార్చేసి అమ్మోరు తల్లికి సీక్వెల్ కాదంటూ తెలియజేశారు. ఇక నయనతార స్వయంగా పలు దేవాలయాలను దర్శించి మరి అక్కడ ఉండే మహిళలకు చీరలు కూడా పంచిపెట్టారు. ఈ సినిమా ప్రమోషన్స్ తో భారీ అంచనాలు ఏర్పడినప్పటికీ ఈ సినిమా విడుదలై కథలో బలం లేకపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా విడుదలై ఫస్ట్ వీక్ పూర్తి అయినప్పటికీ కూడా ఇంకా రూ.10 కోట్ల కలెక్షన్స్ కూడా రాబట్ట లేకపోవడంతో సినిమా కొన్న బయ్యర్లు తీవ్ర నష్టాలలో కూరుకుపోతున్నామని తెలుపుతున్నారు.

- Advertisement -
Advertisement

also read:Hero suriya:పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో..!

ఆ చిత్రాలదే హవా..

ఈ చిత్రంలో నయనతార మహాశక్తి పోలీస్, కానిస్టేబుల్ గా రెండు పాత్రలలో చేసినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు.. ముఖ్యంగా ఈ సినిమా కోసం ఎక్కువగా ఏ ఐ ని ఉపయోగించారని , దానిని విఎఫ్ఎక్స్ అనుకోమంటే జనం నమ్మే పరిస్థితిలో కనిపించలేదని విధంగా మరొకసారి రుజువైనట్లు కనిపిస్తోంది. కంటెంట్ లో కొత్తదనం లేకపోవడం రొటీన్ స్టోరీ, డివోషనల్ ఫార్ములాను డైరెక్టర్ సుందర్ సి ను మళ్లీ నమ్ముకోవడంతో ఈ సినిమా చూసిన నయనతార అభిమానులే ఈ సినిమా ఏంటి బాబు ఇలా ఉంది అంటూ థియేటర్లో నుంచి బయటికి వచ్చేస్తున్నారట. నయనతార సినిమా అయ్యుండి కేవలం 10 కోట్ల రూపాయలు కూడా కలెక్షన్స్ రాబట్ట లేకపోవడంతో ఇది ఘోర అవమానం అంటూ పలువురు నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. నయనతార సినిమాకి పోటీగా విడుదలైన రామాయణ, సీన్ చిత్రాలు బాగానే కలెక్షన్స్ రాబడుతున్నాయి. మూకుత్తి అమ్మన్ 2 చిత్రం నయనతార స్టార్ డం పైన గట్టిదెబ్బ పడేలా ఉందంటూ సినివర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you