Tuesday, November 17, 2026
HomeLATESTTeja Sajja:నిశ్చితార్థం చేసుకున్న తేజ సజ్జా..తేజ సజ్జా కాబోయే భార్య ఎవరు?

Teja Sajja:నిశ్చితార్థం చేసుకున్న తేజ సజ్జా..తేజ సజ్జా కాబోయే భార్య ఎవరు?

Teja Sajja:తేజ సజ్జా నిశ్చితార్థ వేడుకకు పలువురు ప్రముఖులు విచ్చేసి కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఈ వేడుకలో పాల్గొన్నారు. సినీ రంగం నుంచి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, దర్శకుడు ప్రశాంత్ వర్మ,

on
- Advertisement -banner Ad

Teja Sajja:టాలీవుడ్‌లో విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ హీరో తేజ సజ్జా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి, ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ హీరో జీవితంలో త్వరలో ఓ కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. తాజాగా ఆయన నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను ప్రైవేట్‌గా నిర్వహించారు.

హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ వేడుక :

తేజ సజ్జా నిశ్చితార్థం హైదరాబాద్‌లోని ప్రముఖ తాజ్ కృష్ణ హోటల్‌లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరైయారు. వేడుకను ఆర్భాటంగా కాకుండా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ప్రత్యేకంగా నిర్వహించినప్పటికీ ప్రముఖుల రాకతో సందడి నెలకొంది. తేజ సజ్జా భార్య చూడటానికి చాలా అందంగా ఉంది . హీరోయిన్ కి మించిపోయే రేంజ్ లో ఉంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

తేజ సజ్జా కాబోయే భార్య ఎవరు? :

ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం తేజ సజ్జా జీవిత భాగస్వామి ఎవరనే అంశం. అయితే కాబోయే వధువుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. అందుతున్న సమాచారం ప్రకారం ఆమె అమెరికాకు చెందిన యువతిగా తెలుస్తోంది. ఆమె కుటుంబం వ్యాపార రంగంలో కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

డిసెంబర్‌లో రాజస్థాన్‌లో వివాహం? :

నిశ్చితార్థం పూర్తవడంతో ఇప్పుడు అందరి దృష్టి తేజ సజ్జా పెళ్లిపైనే ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ నెలలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ వివాహ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. అందమైన ప్యాలెస్‌లు, ప్రత్యేకమైన వివాహ వేడుకలకు ప్రసిద్ధి చెందిన ఉదయ్‌పూర్‌లో తేజ సజ్జా పెళ్లి జరగనుందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

- Advertisement -
Advertisement

also read:Dulquer Salmaan:దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఓ తార’ ట్రైలర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న ఎమోషనల్ స్టోరీ!

నిశ్చితార్థానికి హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు :

తేజ సజ్జా (Teja Sajja)నిశ్చితార్థ వేడుకకు పలువురు ప్రముఖులు విచ్చేసి కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఈ వేడుకలో పాల్గొన్నారు. సినీ రంగం నుంచి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, దర్శకుడు ప్రశాంత్ వర్మ, నటుడు శివాజీ హాజరయ్యారు. అలాగే ‘హనుమాన్’ సినిమాతో తేజ సజ్జాకు మంచి విజయాన్ని అందించిన ప్రశాంత్ వర్మ రాక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

- Advertisement -
Advertisement

also read:OTT: థియేటర్ రిలీజ్‌లు.. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్న కొత్త సినిమాలివే!

సందడి చేసిన టాలీవుడ్ ప్రముఖులు :

వీరితో పాటు రానా దగ్గుబాటి, మాస్ మహారాజా రవితేజ, నేచురల్ స్టార్ నాని, వరలక్ష్మి శరత్ కుమార్, శ్రీకాంత్, కోన వెంకట్ తదితరులు నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు. ‘మిరాయ్’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కూడా ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది.

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి పాన్ ఇండియా హీరోగా..:

తేజ సజ్జా ప్రయాణం బాలనటుడిగా ప్రారంభమైంది. ‘చూడాలని ఉంది’, ‘ఇంద్ర’, ‘కలిసుందాం రా’, ‘గంగోత్రి’ వంటి చిత్రాల్లో బాలనటుడిగా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత హీరోగా మారి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ముఖ్యంగా ‘హనుమాన్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించాడు. ఇటీవల ‘మిరాయ్’తోనూ ప్రేక్షకులను అలరించాడు. కెరీర్‌లో వరుస విజయాలతో ముందుకు సాగుతున్న తేజ సజ్జా ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోనూ కొత్త ప్రయాణానికి సిద్ధమవుతుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you