Wednesday, November 25, 2026
HomeLATESTnithya menen:హీరోయిన్ నిత్యామీనన్ కి లవ్ బ్రేకప్ అయ్యిందా?

nithya menen:హీరోయిన్ నిత్యామీనన్ కి లవ్ బ్రేకప్ అయ్యిందా?

Nithya Menen: ప్రముఖ హీరోయిన్ నిత్యామీనన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తను లవ్ బ్రేకప్ గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

on
- Advertisement -banner Ad

nithya menen:సహజమైన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్ నిత్యామీనన్ ఈ మధ్యకాలంలో పెద్దగా ఏ సినిమాలలో కూడా కనిపించలేదు. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం, వివాహానికి సంబంధించి కొన్ని విషయాలు ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటి విషయాలలో ఎప్పుడూ కూడా మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. తాజాగా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గత ప్రేమ బంధాలు ఒంటరి జీవితం పైన ఉన్న అపోహలను తెలియజేసింది.

టాక్సిక్ ప్రేమ నుండి బయటపడ్డాను..

నిత్యామీనన్(nithya menen) మాట్లాడుతూ.. తన గత రిలేషన్షిప్ ఎందుకు విఫలమయ్యింది? ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? అనే ప్రశ్నకి స్పందించింది.. “మన ఆత్మను, వ్యక్తిత్వాన్ని అణిచివేసే పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ బంధంలో కొనసాగడం సరైనది కాదు. ఎదుటివారి ప్రభావం వల్ల మనం ఎదగలేక పోతున్నాము. కనీసం స్వేచ్ఛగా ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నాం అనిపించినప్పుడు కచ్చితంగా అక్కడి నుంచి బయటికి రావడమే ఉత్తమం” అంటూ తెలియజేసింది. గతంలో తాను కొన్ని బంధాలు తన ఆలోచనలకు పనులకు అడ్డుకట్టుగా ఉండేవని, ఆ సమయంలో తాను చాలా బలహీనంగా మారిపోయాను.. ఆ ఉక్కిరి బిక్కిరి చేసే వాతావరణం నుంచి బయటకు అడుగుపెట్టిన తర్వాతే తాను ప్రశాంతంగా ఉండగలిగాను అంటూ తెలిపింది.

- Advertisement -
Advertisement

also read:Dimple Hayathi:డింపుల్ హయాతికి స్టేజ్ పైన లవ్ యు చెప్పిన హీరో..!

స్పష్టమైన అవగాహన నన్ను ముందుకు నడిపించింది..

ఆ సమయంలో తీసుకున్న ఆ నిర్ణయం భయంతో కాదని తన పైన తనకు కలిగిన ఒక స్పష్టమైన అవగాహన అంటూ తేల్చి చెప్పింది.. నిత్యామీనన్ ఇప్పటికీ సింగల్ గా ఉండడంతో ఆమెకు అసలు వివాహ వ్యవస్థ పైన నమ్మకం లేదనే దుష్ప్రచారం సోషల్ మీడియాలో జరగడం పైన కూడా స్పందించింది.. నేను వివాహం చేసుకోనని ఎప్పుడూ చెప్పలేదు .నాకు వివాహ బంధం పైన చాలా గౌరవం ఉంది. పెళ్లి చేసుకోవాలని ఆశ కూడా ఉంది.కానీ అందరూ చేసుకుంటున్నారనో లేక వయసు పెరుగుతోందో అని ముక్కుబడిగా వివాహం చేసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు అంటూ తెలిపింది.

- Advertisement -
Advertisement

also read:Tharun Bhascker:నన్ను తక్కువగా అంచనా వేస్తే ఊరుకోను.. తరుణ్ భాస్కర్ మాస్ వార్నింగ్!

అలాంటి భాగస్వామి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా..

అలాగే తనకు కాబోయే భాగస్వామి ఎలా ఉండాలనే విషయం పైన నిత్యమీనన్ మాట్లాడుతూ.. నాకు కావాల్సింది కేవలం ఒక పెళ్లి తంతు కాదు జీవితాంతం నడిచే ఒక సరైన వ్యక్తి తోడు.. నా వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ నాకు పూర్తి స్వేచ్ఛను కలిగించే వ్యక్తి దొరికితే కచ్చితంగా వివాహం చేసుకుంటానని, అలాంటి భాగస్వామి దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగా ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడతానంటూ నిత్యమీనన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. 2025లో ఏకంగా మూడు చిత్రాలలో నటించిన నిత్యామీనన్ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ గ్రే అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయినట్లు సమాచారం త్వరలోనే విడుదల తేదీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you