Wednesday, November 25, 2026
HomeLATESTChiranjeevi:మెగావర్స్ షో కోసం చిరుకు రూ.200 కోట్లు.. ఓటీటీలో సరికొత్త రికార్డ్!

Chiranjeevi:మెగావర్స్ షో కోసం చిరుకు రూ.200 కోట్లు.. ఓటీటీలో సరికొత్త రికార్డ్!

Chiranjeevi:ఈ టాక్‌ షో గురించి నెట్‌ఫ్లిక్స్‌ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. ''N వచ్చేసింది.. మెగా కొలాబరేషన్ కుదిరేసింది! మెగా నోస్టాల్జియా, మెగా నవ్వులు, మెగా ముచ్చట్లు.. అన్నీ ఒకే చోట. మెగాస్టార్ చిరంజీవి

on
- Advertisement -banner Ad

Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మరో ఆసక్తికరమైన వార్త అందింది. వెండితెరపై ఎన్నో ఏళ్లుగా తనదైన నటన, కామెడీ టైమింగ్, డ్యాన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన.. ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ కోసం చిరంజీవి హోస్ట్‌గా ‘మెగావర్స్‌’ పేరుతో ఓ ప్రత్యేకమైన టాక్‌ షో రూపొందుతోంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన టీజర్ ఈ అంచనాలను మరింత పెంచేసింది.

‘CHIRA_JEEVI’ హోర్డింగుల వెనుక అసలు కథ ఇదే:

గత రెండు రోజులుగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ‘CHIRA_JEEVI’ పేరుతో ఏర్పాటు చేసిన హోర్డింగులు అందరి దృష్టిని ఆకర్షించాయి. సాధారణంగా చిరంజీవి పేరును ‘CHIRANJEEVI’ అని రాస్తారు. అయితే ఈ హోర్డింగుల్లో ‘N’ అనే అక్షరం కనిపించకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. అసలు చిరంజీవి పేరులో ఆ అక్షరాన్ని ఎందుకు తొలగించారు? దీని వెనుక ఏదైనా ప్రత్యేకమైన ప్రచార వ్యూహం ఉందా? అంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది.

- Advertisement -
Advertisement

తాజాగా ‘మెగావర్స్‌’ టీజర్ విడుదలతో ఈ ప్రశ్నలకు సమాధానం లభించింది. చిరంజీవి(Chiranjeevi) పేరులో మిస్ అయిన ‘N’ అక్షరం స్థానంలో నెట్‌ఫ్లిక్స్‌ వచ్చిందనే అర్థం వచ్చేలా టీజర్‌ను రూపొందించారు. మెగాస్టార్, నెట్‌ఫ్లిక్స్‌ కలయికను వినూత్నంగా పరిచయం చేస్తూ వీడియోను విడుదల చేశారు. చివర్లో చిరంజీవి స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చి ”ఇది నా అడ్డా” అంటూ చెప్పిన డైలాగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

also read:Bandla Ganesh;బండ్ల గణేష్‌తో వివాదానికి ఫుల్‌స్టాప్.. 15 ఏళ్ల స్నేహంపై కీలక ప్రకటన!

- Advertisement -
Advertisement

మెగా నోస్టాల్జియా.. మెగా నవ్వులు:

ఈ టాక్‌ షో గురించి నెట్‌ఫ్లిక్స్‌ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. ”N వచ్చేసింది.. మెగా కొలాబరేషన్ కుదిరేసింది! మెగా నోస్టాల్జియా, మెగా నవ్వులు, మెగా ముచ్చట్లు.. అన్నీ ఒకే చోట. మెగాస్టార్ చిరంజీవి మెగావర్స్‌తో నెట్‌ఫ్లిక్స్‌ యూనివర్స్‌లోకి అడుగుపెట్టారు” అంటూ వెల్లడించింది. ఈ కార్యక్రమం త్వరలోనే ప్రారంభం కానుందని తెలిపింది.

ఈ షోలో చిరంజీవి తనదైన శైలిలో అతిథులతో ముచ్చటించనున్నట్లు తెలుస్తోంది. సినీ ప్రముఖులతో ఆసక్తికరమైన సంభాషణలు, వినోదభరితమైన సంఘటనలు, మెగా జ్ఞాపకాలు ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించనున్నాయని అభిమానులు ఆశిస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:TFJA: సినీ జర్నలిస్ట్ దేవిప్రియకు బిగ్ షాక్.. మళ్లీ వేటు!

ఒక్కో ఎపిసోడ్‌కు రూ.14 కోట్లు? :

మరోవైపు ‘మెగావర్స్‌’ కార్యక్రమానికి చిరంజీవి తీసుకుంటున్న పారితోషికం గురించి కూడా సినీ వర్గాల్లో ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఈ షో కోసం నెట్‌ఫ్లిక్స్‌ మెగాస్టార్‌కు భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం కార్యక్రమానికి గానూ దాదాపు రూ.180 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు పారితోషికం అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో ఎపిసోడ్‌కు సుమారు రూ.12 కోట్ల నుంచి రూ.14 కోట్ల వరకు చెల్లిస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.

గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంతో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన చిరంజీవి.. ఇప్పుడు తొలిసారిగా టాక్‌ షో ద్వారా ఓటీటీ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. దీంతో ‘మెగావర్స్‌’ ఎప్పుడు స్ట్రీమింగ్‌కు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you