Wednesday, November 25, 2026
HomeLATESTBollywood Ramayana:ఆస్కార్ రేసులో బాలీవుడ్ రామాయణ..!

Bollywood Ramayana:ఆస్కార్ రేసులో బాలీవుడ్ రామాయణ..!

Bollywood Ramayana: అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాలీవుడ్ రామాయణ చిత్రం ఇప్పుడు ఏకంగా ఆస్కార్ బరిలో దిగడం గమనార్హం.

on
- Advertisement -banner Ad

Bollywood Ramayana:బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా , యశ్ రావణుడిగా నితీష్ తివారీ దర్శకత్వంలో వచ్చిన అత్యంత ప్రతిష్టాత్మకమైన పారాణిక చిత్రం రామాయణం. సినిమా కలెక్షన్స్ కూడా ఇప్పటికే 1700 కోట్లకు పైగా రాబట్టింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా అంతర్జాతీయ వేదిక పైన సత్తా చాటడానికి సిద్ధమయ్యింది. 99 వ (2027)ఆస్కార్ బరిలో ఈ సినిమా కీలకంగా ముందడుగు వేసినట్లు తెలుస్తోంది.

టాప్ 20 జాబితాలో రామాయణ..

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన టాప్ 20 చిత్రాల జాబితాలలో రామాయణం సినిమా చోటు దక్కించుకున్నట్లు వినిపిస్తోంది. గతంలో డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రానికి గాను ఆస్కార్ విజువల్ ఎఫెక్ట్ విభాగంలో టాప్ 20 వరకు చేరుకొని ఇండియన్ సినిమా స్థాయిని మరింత పెంచింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అలాంటి గుర్తింపుతో రామాయణం సినిమా నిలవడం గమనార్హం. మన దేశీయ పురాణగాథను అంతర్జాతీయ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్తో తెరకెక్కించడం వల్లే అకాడమీ సభ్యుల దృష్టిని ఈ సినిమా ఆకర్షించిందని, వీటికి తోడు ఇటీవలే ప్రకటించిన 32వ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల షార్ట్ లిస్టులో కూడా.. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్, బెస్ట్ స్టంట్ డిజైన్ విభాగంలో ఈ సినిమా నిలవడం గమనార్హం.

- Advertisement -
Advertisement

also read:nithya menen:హీరోయిన్ నిత్యామీనన్ కి లవ్ బ్రేకప్ అయ్యిందా?

అంతటి గుర్తింపును సొంతం చేసుకుంటుందా?

ఆస్కార్ వీఎఫ్ఎక్స్ రేసులో రామాయణ సినిమా సామాన్య సినిమాలతో పోటీ పడడం లేదు. ముఖ్యంగా హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ రూపొందించిన ది ఒడిస్సీ మూవీ, డ్యూన్ పార్ట్ 3, అవెంజర్స్ : డూమ్స్ డే , స్పైడర్ మాన్, గాడ్జిల్లా మైనస్ జీరో వంటి హాలీవుడ్ చిత్రాలతో కలిపి రామాయణం (Bollywood Ramayana)సినిమా పోటీ పడుతూ ఉండడం జరుగుతుంది. ఈ చిత్రానికి ఇంతటి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం వెనుక టెక్నికల్ టీం యొక్క అపారమైన శ్రమ దాగి ఉందని చెప్పవచ్చు.

- Advertisement -
Advertisement

also read:Dimple Hayathi:డింపుల్ హయాతికి స్టేజ్ పైన లవ్ యు చెప్పిన హీరో..!

అప్పటివరకు ఎదురుచూడాల్సిందే..

ఇప్పటికే ఎనిమిది ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న విఎఫ్ఎక్స్ సంస్థ DNEG ,REDEFINE ఈ చిత్రానికి కూడా కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్ అందించాయని చెప్పవచ్చు. నమిత్ మల్హోత్రా, యశ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ కలసి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. రామాయణం సినిమా ప్రస్తుతం ఆస్కార్ నామినేషన్ లో కాదు కేవలం ఇది ప్రాథమిక అర్హత జాబితా టాప్ 20 లో మాత్రమే స్థానం సంపాదించుకుంది. అకాడమీ సభ్యుల ఓటింగ్ అనంతరం డిసెంబర్ 15న 10 చిత్రాల షాట్ లిస్టును ప్రకటిస్తారు ఆ తర్వాత జనవరి 21న ఆస్కార్ అవార్డుల కోసం పోటీపడి , ఐదు చిత్రాలను నామినేషన్ లో వెలువడతాయి. మరి రామాయణం సినిమా ఆస్కార్ బరిలో నిలిచి చరిత్ర సృష్టిస్తుందో లేదో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you