Vijay Varma: బాలీవుడ్ లో విలక్షణమైన నటుడుగా పేరు సంపాదించిన విజయ్ వర్మ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. తెలుగులో ఒకటి రెండు చిత్రాలలో నటించిన ఈ నటుడు హీరోయిన్ తమన్నా ప్రేమ వ్యవహారం వల్ల నిరంతరం వార్తల్లో నిలుస్తున్నాడు. అనంతరం ఇద్దరి మధ్య బ్రేకప్ విషయంలో కూడా వైరల్ గా మారారు. అయితే ఇప్పుడు తాజాగా నటుడు విజయ్ వర్మ చుట్టూ ఒక ఊహించని వివాదం చుట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆయన పి.ఆర్. టీమ్ నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ప్రముఖ నటి నేహళ్ వడోలియా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
విజయ్ వర్మ పి.ఆర్ టీం నుండి నటికి బెదిరింపులు..
నటి నేహాల్ మాట్లాడుతూ తనను భయభ్రాంతులకు గురి చేసేలా, గత కొంతకాలంగా మానసిక క్షోభకు గురయ్యేలా చేస్తున్నారని తెలిపింది. నేను ఏ పాడ్ కాస్ట్ కి వెళ్ళినా సరే నా గొంతు నొక్కేస్తున్నారని బహిర్గతంగా తెలియజేసింది. విజయ్ వర్మ(Vijay Varma)స్వయంగా నాకు ఫోన్ చేసి మరి బెదిరిస్తున్నారు లేదా అతని పి.ఆర్ టీం ద్వారా కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ నటి నేహా సంచలన ఆరోపణలు చేసింది. ఇండస్ట్రీలో ఈ వాతావరణం బెదిరింపుల కారణంగా తాను గత నాలుగేళ్లుగా ఎలాంటి ప్రాజెక్టులు కూడా చేయలేదంటూ వెల్లడించింది.
ALSO READ:Pawan–Mahesh:అజిత్-విజయ్ లాగా.. మహేష్-పవన్ చేయలేరా..? ఎందుకు..?
మనుషుల కంటే జంతువులే నయం..
ఇలాంటి దారుణమైన వాతావరణంలో నేను బ్రతకలేను. నా చుట్టూ ఉన్న మనుషుల కంటే కూడా కుక్కలు , ఆవులు వంటి జంతువులే ఉండేలా చూడమని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అంటూ తెలిపింది. ఈ మనుషులకంటే అవే చాలా ప్రేమగా ఉంటాయి. మనుషుల పైన తనకి విరక్తి కలిగిందంటూ ఆవేదనతో తెలుపుతోంది నటి నేహాల్. ఇకపై ఎవరిని కలిసే ఉద్దేశం కూడా తనకు లేదని ఒంటరిగానే జీవించాలనుకుంటున్నాను అంటూ ఆమె స్పష్టం చేసింది. ఈ తీవ్రమైన ఆరోపణలు సైతం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారుతున్నాయి. ఇందుకు సంబంధించి బలం చేకూర్చేలా ఆమె షేర్ చేసిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ALSO READ:Vishnu Priya:నటన నుంచి బిజినెస్ వరకు.. జానకి పరిణయం విష్ణు ప్రియ సక్సెస్ స్టోరీ..!
స్పందించని విజయ్ వర్మ..
నటి నేహాల్ చేసిన వ్యాఖ్యలపైన నటుడు విజయ్ వర్మ కాని ఆయన టీం కానీ ఏ విధంగా స్పందించలేదు. మరి ఈ విషయం పైన ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి. ప్రస్తుతం విజయ్ వర్మ వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో నటి చేసిన కామెంట్స్ ఆయన సినీ కెరియర్ కి ఏ విధంగా ఇబ్బందులను కలిగిస్తాయో చూడాలి మరి.




