TV:కన్నడతో పాటు తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కూడా పరిచయమైన నటి ఐశ్వర్య వర్మ. తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆకట్టుకుంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది . నటనపై ఉన్న అభిరుచిని నిజం చేసుకునేందుకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఆమె ప్రస్తుతం టెలివిజన్ రంగంలో తనదైన ముద్ర వేసుకొని ముందుకు వెళుతుంది.
నటన కోసం చేసిన పోరాటం:
కర్ణాటకకు చెందిన ఐశ్వర్య వర్మకు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండేది. అయితే కుటుంబ సభ్యులు మొదట్లో ఈ రంగంలోకి రావడానికి అంగీకరించలేదు. అయినప్పటికీ తన లక్ష్యాన్ని వదులుకోకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. కెరియర్ ప్రారంభ దశలో పలు ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. అయినా సరే పట్టుదలతో అవకాశాలను అందిపుచ్చుకొని తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఐటీ రంగంలో పనిచేస్తున్న అభినయ్ వర్మను ఐశ్వర్య వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం కొంతకాలం ఒక విరామం ఇచ్చిన ఈ బ్యూటీ.. ఒక స్టార్టప్ ప్రారంభించింది. అయితే భర్త ప్రోత్సాహంతో మళ్ళీ నటన వైపు అడుగులు వేసి టెలివిజన్ (TV)రంగంలో రీఎంట్రీ ఇచ్చింది. కుటుంబం,కెరీర్ రెండిటిని బ్యాలెన్స్ చూస్తూ ముందుకు సాగుతుంది.
also read:Dhanush:రాయన్ జాతీయ అవార్డు రచ్చ.. విమర్శకుల నోళ్లు మూయించేలా ధనుష్ రియాక్షన్..!
తెలుగు ప్రేక్షకులకు చేరువైన పాత్రలు:
కన్నడ టెలివిజన్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరియర్ ప్రారంభించిన ఐశ్వర్య తర్వాత తెలుగు సీరియల్స్ లో అవకాశాలు దక్కించుకుంది. ముఖ్యంగా “చామంతి” సీరియల్ లో “రోజా” పాత్ర ద్వారా మంచి గుర్తింపు పొందింది. విలనిజం , గ్లామర్ కలిసిన ఆ పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం తెలుగు, కన్నడ ప్రాజెక్టులలో కీలకపాత్రలో పోషించింది. సోషల్ మీడియాలో కూడా ఐశ్వర్య వర్మ చురుగ్గా ఉంటుంది. షూటింగ్ విశేషాలు, కుటుంబంతో గడిపే క్షణాలు, ఫిట్నెస్ వీడియోలు రకరకాల ఫోటోలు అభిమానులతో పంచుకుంటూ వారితో నిరంతరం టచ్ లో ఉంటుంది.
also read:Sai Pallavi:సినీ ఇండస్ట్రీలో మరో సంచలనం..టాప్ హీరోయిన్లకు షాక్ ఇచ్చిన సాయిపల్లవి..!
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఐశ్వర్య వర్మ ఒక్కో షూటింగ్ రోజుకు సుమారు రూ.25,000 వరకు పారితోషకం అందుకున్నట్లు తెలుస్తుంది. నెగిటివ్ పాత్రను సహజంగా పోషించడంలో, గ్లామర్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఐశ్వర్య వర్మ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కుటుంబం నుంచి లభించిన మద్దతు.. ముఖ్యంగా భర్త ప్రోత్సాహమే తన విజయానికి ప్రధాన కారణం అని ఆమె పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు .




