Jailer 2 OTT:సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ చిత్రం జైలర్. ఈ సినిమా అప్పట్లో థియేటర్లలో కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. ఈ చిత్రానికి సీక్వెల్ గా జైలర్ 2 సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి సినిమా పైన అంచనాలు పెరిగిపోయాయి. అనుకున్నట్టుగానే అక్టోబర్ 15వ తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు 650 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. తెలుగులో 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన మొట్టమొదటి తమిళ చిత్రంగా నిలిచింది.
ఓటిటి స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న జైలర్ 2..
ముఖ్యంగా జైలర్ 2 లో (Jailer 2 OTT)రజనీకాంత్ మాస్, యాక్షన్ పవర్ఫుల్ డైలాగులతో అభిమానులను బాగా ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ పై పలువురు అభిమానులు , నెటిజన్స్ చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి డిజిటల్ స్ట్రిమింగ్ డేట్, ఓటిటి డీల్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం జైలర్ 2 చిత్రం నవంబర్ 12వ తేదీన ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ లలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రిమింగ్ కాబోతున్నట్లు సమాచారం.
also read:Comedian Ali:కమెడియన్ ఆలీ భార్యకి సర్జరీ.. ఎమోషనల్ అయిన ఆలీ.. వీడియో వైరల్..!
150 కోట్లకు పైగా భారీ డీల్..
తమిళం తో పాటుగా తెలుగు, హిందీ, కన్నడ ,మలయాళం భాషలలో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను తీసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాను ఇంట్లో ఆస్వాదించవచ్చని అభిమానులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన అయితే ఇంకా వెలువడాల్సి ఉన్నది. ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ భారీగానే చెల్లించినట్లు వినిపిస్తున్నాయి. సుమారుగా 150 కోట్లకు పైగా డీల్ కుదుర్చుకున్నట్లు తమిళ ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది.
also read:OM Movie Glimpse:ఓం సినిమా నుంచి ఐపీఎస్ నిత్యా రెడ్డి గా సాయి పల్లవి గ్లింప్స్ వైరల్..!
రజనీకాంత్ ప్రస్తుత సినిమాలు..
ఒక సౌత్ ఇండియన్ సినిమాకి ఈ స్థాయిలో డిజిటల్ రైట్స్ పలకడం అంటే అది గొప్ప విశేషమని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద రాబోయే రోజుల్లో ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్ల రూపాయలను వసూలు చేస్తుందని అభిమానులు ధీమా చేస్తున్నారు. త్వరలోనే ఓటీటి మార్కెట్ విషయాలను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. రజనీకాంత్ ప్రస్తుతం ధర్మన్ అనే మరో చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నయనతార హీరోయిన్గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పైన కూడా మరింత అంచనాలను పెంచేసినట్లు కనిపిస్తోంది. వీటికి తోడుగా జైలర్ 3 సినిమా కూడా ఉంటుందని చివరిలో చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమా పైన ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి మరి. మొత్తానికి థియేటర్లలో సందడి చేస్తున్న జైలర్ 2 చిత్ర మరి ఓటీటిలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.




