చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అవికాగోర్ తొలిసారి ఉయ్యాల జంపాల సినిమాతో ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా వచ్చింది.
మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోయిన్గా నటించి మెప్పించింది.
తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న అవికా గోర్ ఇటీవల బాలీవుడ్ నటుడినే పెళ్లి చేసుకుని సెటిల్ అయిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం సినిమాలతో బిజీగా మారిన ఈమె మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ట్రెండీ అవుట్ ఫిట్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
ఈ మేరకు స్లీవ్ లెస్ పింక్ కలర్ మ్యాక్సీ డ్రెస్ ధరించింది. దీనికి వైట్ పోల్క చుక్కలతో చక్కగా డిజైన్ చేశారు.
ఇక మనసుకు నచ్చింది ధరించాలి అంటూ ఈమె ఇచ్చిన క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.