Monday, July 27, 2026
HomeLATESTKajal Agarwal:కారవాన్ లో అభిమాని దెబ్బకు భయపడిన కాజల్ అగర్వాల్..!

Kajal Agarwal:కారవాన్ లో అభిమాని దెబ్బకు భయపడిన కాజల్ అగర్వాల్..!

Kajal Agarwal: ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గతంలో తనకు ఎదురైన ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది అభిమానుల వల్ల ఇబ్బంది పడ్డాను అంటూ తెలిపింది.

on
- Advertisement -banner Ad

Kajal Agarwal:టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ అందం, అభినయంతో ఎంతోమంది స్టార్ హీరోలకు జోడిగా నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. కొన్ని పాత్రలలో కేవలం హీరోయిన్ కాజల్ తప్ప మరెవరు చేయలేరు అనేటట్టుగా నటించింది. వివాహం అనంతరం కాజల్ అగర్వాల్ కు హీరోయిన్గా అవకాశాలు తగ్గడంతో సీనియర్ హీరోలకు జోడిగా పలు చిత్రాలలో నటిస్తోంది. అంతేకాకుండా పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తున్న కాజల్ అగర్వాల్ తాజాగా ది ఇండియా స్టోరీ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక విషయాన్ని తెలియజేసింది.

అభిమాని అతి వల్ల భయపడ్డ కాజల్..

సెలబ్రెటీలు అభిమానుల పేరుతో కొందరు చేసి అతి ప్రవర్తన వల్ల చాలా అసౌకర్యంగా గురైన సందర్భాలు చాలానే చూశాము. అలా కాజల్ అగర్వాల్ కి కూడా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక ఘటన ఎదురయ్యిందని తెలియజేసింది. రెండు దశాబ్దాలుగా దక్షిణాది ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ వివాహం అనంతరం తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టింది. ప్రస్తుతం బాలయ్య NBK 111 లో అలాగే రామాయణ వంటి భారీ ప్రాజెక్టు చిత్రాలలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement

also read:Prabhas Srinu :నా జీవితంలో ప్రభాస్ దేవుడే.. టాలీవుడ్ కమెడియన్ కామెంట్స్!

ఒంటరిగా ఉన్నప్పుడు కారవాన్ లోకి వచ్చాడు..

తాజా ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్(Kajal Agarwal) మాట్లాడుతూ.. ఒక సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత నేను కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఒంటరిగా కారావాన్ లో ఉన్న సమయంలో.. అనూహ్యంగా ఒక వ్యక్తి నా అనుమతి లేకుండానే లోనికి వచ్చారు. అయితే అతను అదే సినిమా యూనిట్ లో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ అని ఆ తర్వాత తెలిసింది కానీ.. తాను ఒక్కసారిగా షర్టు విప్పేసి తన ఛాతీ పైన నా (కాజల్) పేరును టాటూగా వేయించుకున్నట్లు చూపించారని తెలియజేసింది.

- Advertisement -
Advertisement

also read:Dhruv Vikram:వివాదంలో చిక్కుకున్న విక్రమ్ కొడుకు..!

అభిమానం హద్దులు దాటితే అసౌకర్యమే..

అయితే తన అభిమానాన్ని అలా వ్యక్తం చేశారని చెప్పిన కాజల్ అగర్వాల్ అయితే ఆ చర్య తనను తీవ్రంగా భయపెట్టిందంటూ తెలిపింది. అభిమానిగా ప్రేమ చూపించడంలో తప్పులేదు కానీ ఒక మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో అలా అనుమతి లేకుండా ప్రవర్తించడం సరైనది కాదు అని కాజల్ అగర్వాల్ తెలియజేసింది. ఆ తరువాత అతనితో చాలా ప్రశాంతంగా మాట్లాడానని తన పేరుతో టాటో వేయించుకున్నందుకు నటిగా సంతోషంగానే ఉన్నప్పటికీ అభిమానం అనేది పరిమితులను దాటితే ఎవరికైనా అసౌకర్యంగానే ఉంటుందని తెలియజేసింది. ముఖ్యంగా సినిమా షూటింగ్ సెట్లలో హీరోయిన్లకు ప్రైవసీ పైన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you