Pavitra Lokesh:సినీనటి పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగు కన్నడ చిత్ర పరిశ్రమల్లో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం తల్లి, అత్త, వదిన వంటి పాత్రలతో ప్రేక్షకులను ఆదరిస్తున్న పవిత్ర ఒకప్పుడు హీరోయిన్గా కూడా మంచి పేరు సంపాదించారు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలతో ఎప్పుడు కూడా ఆమె వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లోనే:
పవిత్ర లోకేష్(Pavitra Lokesh) గతంలో వివాహం చేసుకొని ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. అనంతరం కన్నడ నటుడు సుచేంద్ర ప్రసాద్ తో కొంతకాలం పాటు సహజీవనం చేశారు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత తెలుగు నటుడు నరేష్ తో ఆమె రిలేషన్షిప్ లో ఉండడం పెద్ద చర్చకు దారితీసింది. ఇద్దరి వ్యక్తిగత జీవితాలపై మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. అనంతరం నరేష్ – పవిత్ర వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
also read:NTR: ఎన్టీఆర్ రా పై కీలక అప్డేట్ ఇచ్చిన టీమ్..!
హీరోయిన్గా మెప్పించిన పవిత్ర:
దశాబ్దాలుగా సినీ రంగంలో కొనసాగుతున్న పవిత్ర కెరియర్ ప్రారంభంలో ఎన్నో కన్నడ చిత్రాలలో హీరోయిన్గా నటించారు. కాలక్రమేన క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి తెలుగు, కన్నడ భాషల్లో వందలాది చిత్రాలలో కీలకపాత్రలు పోషించారు. తన సహజ నటనతో కుటుంబ కథా చిత్రాలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సంప్రదాయ పాత్రల్లో కనిపించే పవిత్ర లోకేష్ ఒకప్పుడు స్పెషల్ సాంగ్ లో కూడా సందడి చేసిన విషయం చాలామందికి తెలియదు. 2004లో విడుదలైన కన్నడ చిత్రం “మోండా”లో ఆమె చిన్న పాత్రలో నటించడంతోపాటు “బారో వీరా జోకుమారా” అనే ప్రత్యేక పాటలో గ్లామరస్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సాయికుమార్ హీరోగా నటించారు.
also read:OTT Movie: ట్విస్టులతో ఉత్కంఠ రేపే క్రైమ్ ధ్రిల్లర్..ఒక్కొక్క సీన్ మాస్టర్ పీస్..డోంట్ మిస్..!
సీరియల్ కిల్లర్ కథతో తెరకెక్కిన మోండా:
మోండా చిత్రంలో సాయికుమార్ సీరియల్ కిల్లర్ పాత్రలో కనిపించారు. అక్రమ సంబంధాలు పెట్టుకునే మహిళలను లక్ష్యంగా చేసుకొని హత్యలు చేసే వ్యక్తిగా ఆయన నటన సాగుతుంది. బయటకు సాధారణ వ్యక్తుల కనిపించిన రహస్యంగా నేరాలకు పాల్పడే పాత్రకు కథలో మంచి ప్రాధాన్యం ఉంటుంది. సినిమాలో పవిత్ర లోకేష్ పాత్రతో హీరోకు పరిచయం ఏర్పడే సమయంలోనే ఈ స్పెషల్ సాంగ్ వస్తుంది. అప్పట్లో కుర్రాలను ఊపు ఊపేసింది ఈ పాట. అనంతరం కథలో భాగంగా ఆమె పాత్రకు విషాదాంతంగా ఉంటుంది. చివరిలో సీరియల్ కిల్లర్ ని పట్టుకుని ఎందుకు పోలీసు అధికారులు పన్నిన వ్యూహంతో కధ ఆసక్తికరంగా సాగుతుంది. మరొకసారి ఈ పాటని సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేసేస్తున్నారు కుర్రాళ్ళు.




