TV:తెలుగు బుల్లితర ప్రేక్షకులకు ముఖ్యంగా స్టార్ మా సీరియల్స్ అభిమానులకు ప్రశాంత్ కడియం ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ప్రసారమవుతున్న “ఇల్లు ఇల్లాలు పిల్లలు” సీరియల్లో చందు పాత్రతో ఆయన మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. విశాఖపట్నం ఆయన స్వస్థలం. అక్కడే విద్యాభ్యాసం కూడా కంప్లీట్ చేశారు. ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేశారు. అయితే నటనపై ఉన్న ఆసక్తి కారణంగా జాబ్ వదిలి ఈ రంగంలోకి అడుగుపెట్టారు. వ్యక్తిగతంగా చాలా సరదాగా ఉంటూ చిల్ అవుట్ అయ్యే వ్యక్తి.. షూటింగ్ సెట్స్ లో సహనటులతో చాలా ఫ్రెండ్లీగా మెలుగుతూ ఉంటారు.
సీరియల్ కెరియర్:
బుల్లితెరకు(TV) రాకముందు ప్రశాంత్ యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ తన టాలెంట్ నిరూపించుకున్నాడు. అనంతరం టెలివిజన్ అవకాశాలు అందుకున్నాడు. అలా అలా ప్రధాన పాత్రలకు ఎదిగారు. ప్రస్తుతం “ఇల్లు ఇల్లాలు పిల్లలు” సీరియల్లో రామరాజు – వేదవతీల కుమారుడుగా చందు పాత్రను పోషిస్తున్నారు. కుటుంబ బాధ్యతలను మధ్యతరగతి యువకుడిగా భార్య శ్రీవల్లితో అప్పుడప్పుడు విభేదాలు వచ్చిన ప్రేమను కోల్పోయిన భర్తగా ఆయన నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ పాత్ర ప్రశాంత్ కెరియర్ లోనే కీలకంగా మారింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
ALSO READ:Pavitra Lokesh:సాయి కుమార్‌తో పవిత్ర లోకేష్ స్పెషల్ సాంగ్.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ వైరల్!
సోషల్ మీడియాలో యాక్టివ్ :
ప్రశాంత్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటారు. షూటింగ్ సెట్స్ లో సహనటులతో కలిసి చేసే రీల్స్ సరదా వీడియోలు అభిమానులను బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సహనటులతో చేసే డ్యాన్స్, కామెడీ రీల్స్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి.
ALSO READ:NTR: ఎన్టీఆర్ రా పై కీలక అప్డేట్ ఇచ్చిన టీమ్..!
రెమ్యునరేషన్:
బుల్లితెర నటీనటుల పారితోషకం సాధారణంగా రోజువారి కాల్ షీట్స్ ఆధారంగానే ఉంటుంది. ఇండస్ట్రీ వర్గాల అంచనాల ప్రకారం “ఇల్లు ఇల్లాలు పిల్లలు” సీరియల్ కి ప్రశాంత్ కడియం రోజుకు రూ.12000 అందుకుంటున్నాడు అన్నట్లు సమాచారం.
ఆసక్తికర విషయాలు:
యూట్యూబ్ నుంచి టెలివిషన్ వరకు ప్రశాంత్ ప్రయాణం పూర్తిగా స్వయంకృషితో సాగింది. షూటింగ్ విరామ సమయంలో క్రికెట్ ఆడటం ఎంతో ఇష్టంగా ఉంటుంది అని ఆయన చెప్పుకొచ్చారు. సీరియల్లో కలిసిన నటించే నటులతో బయట కూడా మంచి ఫ్రెండ్షిప్ మైంటైన్ చేస్తూ ఉంటారు. తెరపై సీరియస్ పాత్రలో కనిపించిన ఆన్ స్క్రీన్ మాత్రం చాలా సరదాగా ఉంటారు అది ఆయన రీల్స్ చూస్తేనే అర్థమయిపోతూ ఉంటుంది సోషల్ మీడియాలో నిరంతరం ఆక్టివ్ గా ఉండే ఆయన ఏ రీల్ పోస్ట్ చేసిన లక్షలాది వ్యూస్ సొంతం చేసుకుంటూ ఉంటాయి.




