Monday, November 2, 2026
HomeLATESTMokshagna:లాస్ట్ మినిట్ లో బిగ్ ట్విస్ట్..మోక్షజ్ఞ సినిమాలో హీరోయిన్ మారిపోయిందోచ్..!

Mokshagna:లాస్ట్ మినిట్ లో బిగ్ ట్విస్ట్..మోక్షజ్ఞ సినిమాలో హీరోయిన్ మారిపోయిందోచ్..!

Mokshagna:ఇక మోక్షజ్ఞ సరసన కథానాయికగా నటించేందుకు రవీనా టాండన్ కుమార్తె రాశా థడానీ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

on
- Advertisement -banner Ad

Mokshagna:నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసేందుకు భారీ స్థాయిలో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సాధారణ కమర్షియల్ సినిమాతో కాకుండా, సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే సోషియో ఫాంటసీ కథతో ఆయన డెబ్యూ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టులో బాలకృష్ణ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్త అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.

వశిష్ఠ దర్శకత్వంలో భారీ సోషియో ఫాంటసీ:

‘బింబిసార’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వశిష్ఠ ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన కథాంశాలు, అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ముఖ్యంగా పునర్జన్మలు, విభిన్న కాలమానాలు, ఆసక్తికరమైన మలుపులతో కథను నడిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో మోక్షజ్ఞ క్యారెక్టర్ చాలా ఢిఫరెంట్ గా ఉండబోతుందట. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో కూడా ఇలాంటి పాత్రలో కనిపించలేదు అని కూడా టాక్ వినిపిస్తుంది.

- Advertisement -
Advertisement

also read:Pragya Jaiswal:రూటు మార్చిన ప్రగ్య జైస్వాల్.. ఇక ఆఫర్లే ఆఫర్లు..!

కీలక పాత్రలో బాలకృష్ణ.. కాజోల్‌కు ప్రత్యేక రోల్? :

ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం ప్రాజెక్టుపై అంచనాలను పెంచుతోంది. తనయుడి తొలి సినిమాలో బాలయ్య కనిపిస్తే అభిమానులకు అది ప్రత్యేకమైన అనుభూతిగా మారనుంది. అంతేకాకుండా బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్‌ను కూడా ఓ ముఖ్యమైన పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఈ పాత్రలో రమ్య కృష్ణ నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ కాజోల్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ఆమె పాత్ర కథకు కీలక మలుపుగా ఉండనుందనే ప్రచారం జరుగుతోంది.

- Advertisement -
Advertisement

also read:Balakrishna:బాలయ్య కథల ఎంపికలో కొత్త ట్విస్ట్.. యువ దర్శకులకు బంపర్ ఆఫర్ !

హీరోయిన్‌గా రాశా థడానీ పేరు :

ఇక మోక్షజ్ఞ (Mokshagna)సరసన కథానాయికగా నటించేందుకు రవీనా టాండన్ కుమార్తె రాశా థడానీ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి హీరోయిన్ గా శ్రీలీల ని ఎంపిక చేసుకున్నారట. కానీ ఆమె కాల్ షీట్స్ అడ్జెస్ట్ అవ్వని కారణంగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందట. ఇప్పటికే బాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్న రాశా.. ఈ ప్రాజెక్టుతో టాలీవుడ్‌లోకి అడుగుపెడితే ఆసక్తికరమైన కాంబినేషన్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆశపడుతున్నారు.

- Advertisement -
Advertisement

భారీ VFXతో విజువల్ వండర్‌గా? :

పునర్జన్మలు, అనేక కాలమానాల్లో సాగే కథనం, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు సమాచారం. మోక్షజ్ఞ తొలి సినిమానే భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మోక్షజ్ఞ డెబ్యూ చుట్టూ వినిపిస్తున్న ఈ వార్తలు నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you