Chandini chaudhary: సినీ ఇండస్ట్రీలో అవకాశాల పేరుతో మహిళల పైన వేధింపులు జరుగుతున్నాయని ఎన్నో సందర్భాలలో చాలామంది సెలబ్రిటీలు తెలియజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో చాలామంది ఇండస్ట్రీని కూడా వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు తాజాగా మరొక టాలీవుడ్ యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. కెరియర్ ప్రారంభంలో ఒక పవర్ఫుల్ వ్యక్తి నుంచి తాను చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు ఆ చేదు అనుభవాన్ని తాజాగా తెలియజేసింది.
అసభ్యకరంగా ప్రవర్తించారు – చాందినీ చౌదరి
2015లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ సమయంలో తనను ఒక వ్యక్తి కలిశారని, ఒక ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కు అంబాసిడర్ గా అవకాశం ఇప్పిస్తానని ఆ వ్యక్తి తెలిపారు.. మొదట తన తల్లి సమక్షంలోనే మాట్లాడారని, కానీ ఆ తర్వాత ఫోన్ చేసి మరి తన రూపురేఖల గురించి చాలా అవమానకరంగా మాట్లాడారంటూ ఆరోపించింది. బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయాలంటే ఇతరులను కన్విన్స్ చేయవలసి ఉంటుందంటూ పరోక్షంగానే తనతో అనుచితంగా ప్రవర్తిస్తూ కమిట్మెంట్ ఇవ్వాలని చాలా ఒత్తిడి తెచ్చారని తెలిపింది చాందిని చౌదరి.
also read:SreeLeela:బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీ లీల..!
ఒప్పుకోలేదని నా తల్లికి ఫోన్ చేశారు – చాందిని
అయితే తాను ఆ కోరికకు ఒప్పుకోకపోవడంతో ఆ వ్యక్తి తన తల్లికి ఫోన్ చేసి మరీ అసభ్యకరంగా మాట్లాడారని మరొకసారి ఫోన్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని గట్టిగా హెచ్చరించిందట చాందిని. ఆ వ్యక్తి కక్ష పెంచుకొని మరి తనపైన ఇండస్ట్రీలో తీవ్రమైన నెగిటివ్ ప్రచారం చేశారని తెలిపింది చాందిని చౌదరి. తనకి పొగరు ఎక్కువ అని , తనతో పని చేయడం చాలా కష్టమని దురుసు ప్రచారం కూడా చేయించారని, అలా అప్పట్లో ఏర్పడిన ఆ చేదు అనుభవాన్ని ఇప్పటికీ తనని వెంటాడుతోందంటూ చాందిని(Chandini chaudhary)ఎమోషనల్ గా మాట్లాడింది.
also read:DC Movie review: డీసీ సినిమా రివ్యూ.. లోకేష్ కనగరాజ్ మెప్పించారా?
మళ్లీ కనిపిస్తే నిలదీశాను – చాందిని చౌదరి
2024లో తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాదులో ఒక హోటల్లో అదే వ్యక్తి మళ్ళీ తనకు ఎదురయ్యారని, గతంలో యాడ్ కోసం మాట్లాడామని, అతను చెప్పగానే ఆరోజు మీరే కదా నన్ను పడుకోమని అడిగింది అని అతని ముఖం మీద నేరుగా నిలదీశానని తెలిపింది. దీంతో ఆమె ధైర్యానికి ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ కి గురయ్యి ,అక్కడినుంచి వెళ్లిపోయారని తెలిపింది చాందిని చౌదరి. కెరియర్ ప్రారంభంలో తాను చాలా సాఫ్ట్ గా ఉండేదాన్ని కానీ ఇలాంటి సంఘటన వల్లే తనని తాను రక్షించుకోవడం కోసం కఠినంగా మారాల్సి వచ్చిందంటూ చాందిని చౌదరి తెలియజేసింది. ఈ విషయం పైన చాందిని చౌదరిని ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు. గత ఏడాది సంతాన ప్రాప్తిరస్తు అనే సినిమాలో నటించిన చాందిని చౌదరి.. తదుపరి సినిమాలను మాత్రం ఇంకా ప్రకటించలేదు.




