Vishwanath and sons trailer:తమిళ స్టార్ హీరోగా పేరు సంపాదించిన సూర్య తాజాగా నటించిన చిత్రం విశ్వనాథ్ & సన్స్. డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సూర్యకి జోడిగా ప్రేమలు ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా సినిమా పైన అంచనాలు పెంచేసింది. ఇప్పుడు తాజాగా చిత్ర బృందం సినిమా ట్రైలర్ ని కూడా విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది.
ఆకట్టుకుంటున్న విశ్వనాధ్ అండ్ సన్స్ ట్రైలర్..
ట్రైల(Vishwanath and sons trailer) విషయానికి వస్తే.. హృదయాన్ని తాకే కుటుంబ కథా చిత్రం అన్నట్టుగా కనిపిస్తోంది. ట్రైలర్లో సంజయ్ విశ్వనాథ్ అని అంతర్జాతీయ పిస్టల్ షూటర్ పాత్రను సూర్య పోషిస్తున్నారు. సూర్య గతంలో ఎన్నడు లేని విధంగా అత్యంత కూల్ అండ్ క్లాసిక్ లుక్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు ట్రైలర్లో కనిపిస్తోంది. తనకంటే వయసులో చాలా చిన్నదైన కథానాయిక మమిత బైజు సూర్య జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత వారిద్దరి మధ్య ఏం జరుగుతుంది ? వారిద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ చుట్టూ తిరిగే సున్నితమైన భాగోద్వేగాలను డైరెక్టర్ వెంకీ కూడా చాలా అద్భుతంగా ఆవిష్కరించినట్లు కనిపిస్తోంది.
also read:Chandini chaudhary: క్యాస్టింగ్ కౌచ్ పై చాందిని చౌదరి సంచలన కామెంట్స్!
ప్రతి డైలాగులో లోతైన అర్థం..
ఈ ట్రైలర్ లో చెప్పే ప్రతి డైలాగులో కూడా చాలా లోతైన అర్థం కనిపిస్తోంది ముఖ్యంగా మన డబ్బు, స్టేటస్ అన్ని మనకు సౌకర్యాన్ని ఇవ్వాలి అంతేకానీ అహంకారం కాకూడదు అని చెప్పే డైలాగ్ హైలైట్ గా ఉంది. అలాగే మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదు ఆ గొడవ జరిగిన తర్వాత మళ్లీ ఎలా మాట్లాడాలో తెలియక విడిపోతున్నారని.. గెలిచేదాక ఆగకూడదు .. గెలిచిన తర్వాత ఆ గెలుపు గురించి ఎక్కువగా మాట్లాడకూడదు వంటి డైలాగ్స్ కూడా హైలెట్ గా ఉన్నాయి.
also read:SreeLeela:బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీ లీల..!
ఆగస్ట్ 14న థియేటర్లలో..
అంతేకాకుండా జీవి ప్రకాష్ అందించిన సంగీతం కూడా ట్రైలర్లో హైలైట్ గా కనిపిస్తోంది. మమిత బైజు, సూర్య మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయినట్టుగా ట్రైలర్లో కనిపిస్తోంది. ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ ఆకట్టుకోగా.. ఇప్పుడు ట్రైలర్ కూడా మరింత హైప్ పెంచేస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న సూర్య మరి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. ప్రస్తుతం ట్రైలర్ వైరల్ గా మారింది.




