Tuesday, July 28, 2026
HomeLATESTOTT:'చెన్నై లవ్ స్టోరీ' ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

OTT:’చెన్నై లవ్ స్టోరీ’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

OTT:కిరణ్ అబ్బవరం నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్, శాటిలైట్ హక్కులను సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా దక్కించుకుంది.

on
- Advertisement -banner Ad

OTT:తాజాగా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటున్న “చెన్నై లవ్ స్టోరీ” సినిమా మరొక కీలకమైన మైలు రాయిని చేరుకుంది. బాక్సాఫీస్ వద్ద తొలి వారాంతంలో ఆకట్టుకునే వసూలు నమోదు చేసిన ఈ చిత్రం డిజిటల్ శాటిలైట్ హక్కులను ప్రముఖ సంస్థ “సోనీ పిక్చర్స్ నెట్వర్క్” ఇండియా సొంతం చేసుకుంది. థియేటర్లలో ప్రదర్శన పూర్తయిన అనంతరం ఈ రొమాంటిక్ ఎంటర్టైన ప్రముఖ ఓటిటీ వేదిక Sony LIV లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది.

ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ప్రేమ కథ :

జులై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఈ సీజన్లో విజయవంతమైన ప్రేమ కథ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. హీరో కిరణ్ అబ్బవరం హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ తొలిసారి జంటగా నటించి తమ సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇద్దరు మధ్య కనిపించే కెమిస్ట్రీ భావోద్వేగ భరితమైన సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Posani :బాలయ్య సినిమా ఫ్లాప్ కారణం నేనే.. పోసాని కామెంట్స్..!

తొలిప్రేమ భావోద్వేగాలకు అద్దం పట్టిన కథ :

యువతలో తొలిప్రేమలో కలిగే ఆనందం, సందేహాలు, ఎత్తు పల్లాలు, భావోద్వేగాలను సహజంగా ఆవిష్కరించే కథతో ఈ సినిమా రూపొందింది. వాస్తవ జీవితానికి దగ్గరగా ఉండే సన్నివేశాలు హృదయాన్ని తాకే భావోద్వేగాలతో దర్శకుడు కథను తెరపై అందంగా మలిచారు. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Adipurush: ఆదిపురుష్ విషయంలో చాలా తప్పు చేశా.. రచయిత షాకింగ్ కామెంట్స్..!

నిర్మాత ఎస్.కే.ఎన్ ఆనందం వ్యక్తం :

డిజిటల్ ఒప్పందంపై నిర్మాత ఎస్.కే.ఎన్ స్పందిస్తూ థియేటర్లలో ప్రేక్షకులు సినిమాని ఎంత ఆదరిస్తుండడంతో సంతోషంగా ఉందన్నారు. సినిమాలోని పాత్రలకు ప్రేక్షకులు కనెక్ట్ కావడం తమకు గొప్ప సంతృప్తిరిచింది అని తెలిపారు. మరింత మంచిగా ప్రేక్షకులకు ఈ చిత్రం చేరువ చేయడానికి సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. దక్షిణాది నుంచి నాణ్యమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో Sony LIV మంచి గుర్తింపు సాధించింది అని .. తమ సినిమా కూడా జాబితాలో చేరడం గర్వకారణం అని పేర్కొన్నారు.ఓటిటి(OTT) రూల్స్ ప్రకారం 8 వారాల తరువాతే స్ట్రిమింగ్ అవుతుంది.

- Advertisement -
Advertisement

త్వరలో ఓటీటీ విడుదల తేదీ ప్రకటన :

ఈ చిత్రానికి సాయి రాజేష్ నీలం కథను అందించగా.. రవి నంబూరి దర్శకత్వం వహించారు. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్ బ్యానర్ల పై ఎస్..కే.ఎన్ సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మించారు. సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ శాటిలైట్ ప్రీమియర్ తేదీలను త్వరలోనే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రేక్షకులు ఇప్పుడు ఆ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you