Shruti Haasan:ఈ మధ్యకాలంలో తరచూ ఎక్కువగా తెలుగు సినీ ఇండస్ట్రీని పనిగట్టుకొని మరీ తక్కువ చేసి మాట్లాడేలా చేస్తున్నట్టు కనిపిస్తోంది. కొంతమంది తమిళ జర్నలిస్టులు అలాగే బాలీవుడ్ జర్నలిస్టులు కూడా ఇలాంటి వ్యవహారాలు చేయడం అలవాటుగా మారిపోయింది.. గతంలో ఏదో తమిళ సినిమాలను పొగుడుతూ తెలుగు చిత్రాలను అపహేళన చేస్తున్న ఒక తమిళ జర్నలిస్ట్ ఇప్పుడు తాజాగా మరోసారి తన బుద్ధిని బయటపెట్టే ప్రయత్నం చేశారు. రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రంలో శృతిహాసన్ స్పెషల్ సాంగ్లో కనిపించే అలరించింది. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించారు.
పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ పై శృతిహాసన్..
పెద్ది సినిమాలోని స్పెషల్ సాంగ్ లో శృతిహాసన్ వేసిన డ్రెస్సింగ్ విషయంలో కూడా వివాదం రేపే సీన్స్ క్రియేట్ చేద్దామనుకున్నారు ఆ జర్నలిస్టు కానీ అతనికి ఊహించని విధంగా షాక్ ఇచ్చింది శృతిహాసన్.. ముఖ్యంగా పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ డ్రెస్సింగ్ విషయంలో చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. అచ్చం అలాంటి విషయాన్ని శృతిహాసన్ ని కూడా రెచ్చగొట్టేలా తెలుగు సినిమాలలో స్పెషల్ సాంగులు అంటే ఏదో తప్పు అన్నట్లుగా ఆమె నోటితోనే చెప్పించాలనుకున్నారు జర్నలిస్ట్.
also read:Dimple Hayathi:డింపుల్ హయతి పెళ్లిపై క్లారిటీ.. నెటిజన్‌కు అదిరిపోయే కౌంటర్!
జర్నలిస్టుకు శృతిహాసన్ దిమ్మతిరిగే కౌంటర్..
తాజా ఇంటర్వ్యూలో జర్నలిస్టు శృతిహాసన్ ను(Shruti Haasan) ఉద్దేశించి పెద్ది సినిమాలో మీరు చేసిన స్పెషల్ సాంగ్ ను ఎలా చూస్తారు? ఎందుకంటే అలాంటి పాటలను ప్రత్యేక ఉద్దేశంతోనే గ్లామరస్ కోసమే పెడతారని మీకు తెలుసు కదా అంటూ శృతిహాసన్ ను ఇరకాటంలో పడేసేలా ప్రశ్న వేశారు.. కానీ ఆ జర్నలిస్టుకు దిమ్మతిరిగేలా కౌంటర్ వేసింది శృతిహాసన్.. నాకు డాన్స్ చేయడం చాలా ఇష్టం. అందంగా రెడీ అవ్వడం అంటే మరీ ఇష్టం. ఆ పాటను నేను ఆ కోణంలోనే చూస్తాను. గ్లామర్ విషయంలో నా ఆలోచన విధానం నాకు చాలా స్వేచ్ఛనిస్తుంది అంటూ ఎవరినో మెప్పించడానికి కోసం తాను ఎప్పుడు ఆ పని చేయలేదు అంటూ తెలిపింది.
also read:Sreeleela:శ్రీలీల ప్రేమాయణం బయటపడిందా.. పుట్టినరోజున సర్‌ప్రైజ్ గిఫ్ట్!
అలాంటివి నేను పట్టించుకోను ..
అంతటితో ఆగకుండా డ్రెస్సింగ్ విషయంలో కూడా తన క్లారిటీ ఏంటో డైరెక్ట్ గానే చెప్పేసింది శృతిహాసన్.. నాకు ఏదైనా డ్రెస్ కంఫర్టబుల్గా అనిపిస్తే నేను అది వేసుకుంటాను లేకపోతే మొహమాట పడకుండా మొఖం మీద చెప్పేస్తానని తెలిపింది శృతిహాసన్.. ఒకవేళ నేను ఆ డ్రెస్ వేసుకొని డాన్స్ చేశాను అంటే కచ్చితంగా నాకు అది పూర్తిగా కంఫర్టబుల్గా ఉన్నట్టే లెక్క అంటూ తెలిపింది.. ఆ విషయంలో చర్చిలో కూడా వాదనలు జరిగాయి తనని డిఫికల్ట్ అనే ముద్ర వేసిన కూడా తాను పట్టించుకోనంటూ వెల్లడించింది. ఎందుకంటే అది నా శరీరం నా ఇష్టం అంటూ నవ్వుతూనే ఆ జర్నలిస్టుకు సమాధానం తెలిపింది.. అటు డ్రెస్సింగ్ విషయంలో కూడా అనవసరపు రాద్ధాంతం చేస్తున్న వారందరికీ కూడా తన సమాధానంతో చెక్ పెట్టింది శృతిహాసన్. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
#Shruthihassan Slipper short Answer to anchor and Jahnavi Kapoor 😂😂🔥🔥🔥🔥 https://t.co/wup8Zj60rS
— Pawanism™ (@santhu_msd7) November 23, 2026




