Kavya – Anirudh:కోలీవుడ్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న అనిరుధ్ ఇటీవలే సన్ టీవీ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ తో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీరి వివాహం నవంబర్ 10 ,11వ తేదీలలో చాలా గ్రాండ్గా గ్రీస్ వేదికగా జరిగింది. దీంతో ఇరువురు కుటుంబ సభ్యులు సన్నిహితులతో పాటుగా కొంతమంది రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరయ్యి.. నూతన దంపతులను ఆశీర్వదించారు. చెన్నైలో తాజాగా అనిరుధ్, కావ్య మారన్ వెడ్డింగ్ రిసెప్షన్ అట్టహాసంగా జరిగింది.
అట్టహాసంగా కావ్య – అనిరుద్ రిసెప్షన్ వేడుక..
అయితే ఈ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకకు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది సెలబ్రిటీలే కాకుండా క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే వెడ్డింగ్ రిసెప్షన్ కోసం ఎంత ఖర్చు చేశారు అనే విషయంపై పలువురు నెటిజన్స్ ఇంటర్నెట్, సోషల్ మీడియా వేదికగా తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలోని కావ్య మారన్(Kavya – Anirudh) వివాహం కోసం ఆయన తండ్రి కళానిధి మారన్ వందల కోట్లు ఖర్చు చేసినట్లుగా వినిపిస్తున్నాయి.
also read:Ananya Sharma:దేవుడంటే నమ్మకం లేదు.. నటి అనన్య కామెంట్స్..!
రూ.200 కోట్లకు పైగా ఖర్చు..
సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రకారం.. గ్రీస్ వేదికగా జరిగిన వెడ్డింగ్ కోసం సుమారుగా 100 కోట్ల రూపాయల వరకు ఖర్చయిందని, తాజాగా చెన్నైలో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ కోసం 70 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లుగా వినిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే ఓవరాల్ గా కావ్య, అనిరుధ్ వివాహం కోసం 200 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం కోలీవుడ్ సినీ పరిశ్రమలో ఈ విషయం మరింత వైరల్ గా మారంది.
also read:Sharwanand:నా కెరీర్‌కు వాళ్లే పిల్లర్స్.. నలుగురు డైరెక్టర్లకు శర్వానంద్ థ్యాంక్స్!
దేశవ్యాప్తంగా ప్రముఖుల నుండి శుభాకాంక్షలు..
వీరి వివాహ రిసెప్షన్ కి సైతం తమిళనాడు సీఎం విజయ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో పాటుగా మాజీ సీఎం స్టాలిన్ మరి కొంత మంది అగ్రనటులతో పాటుగా క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని ఈ వేడుకకు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. తెలుగు సినీ పరిశ్రమ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరు అవ్వగా.. హీరో కార్తీక్, అతిధిరావు హైదరి గా , డైరెక్టర్ అట్లీ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలియజేశారు. మొత్తానికి అంగరంగ వైభవంగా కావ్య మారన్, అనిరుధ్ వివాహమైతే జరిగింది.




