Hema:సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్‌కి సంబంధించిన వార్తలు ఎలా ట్రెండ్ అవుతూ ఉంటాయి అనేది అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసే హేమ గురించి దారుణ, అతి దారుణమైన ట్రోలింగ్ జరిగింది. ఒకప్పుడు ఆమె పేరు చెప్తే ఇండస్ట్రీలో నవ్వులు పూసేది. ఆమె ఏ క్యారెక్టర్‌లో నటించినా సరే అద్భుతంగా ఉంటుంది అని, ఫ్యామిలీ ఆడియన్స్‌కి పర్ఫెక్ట్ ఛాయిస్ హేమ అని పొగడ్తల వర్షం కురిపించే వాళ్లు.
ఇండస్ట్రీలో డిమాండ్ తగ్గడంతో..:
అయితే రాను రాను ఇండస్ట్రీలో ఆమెకు డిమాండ్ తగ్గిపోవడంతో కొంతమంది ఆమెను కావాలని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్న విషయం బయటకు వచ్చింది. మరీ ముఖ్యంగా ఆమె ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, ఆమె ఎలా డబ్బులు సంపాదిస్తుంది, ఎలాంటి కార్లలో తిరుగుతుంది, ఎలాంటి చీరలు కడుతుంది అనే విషయాలు పదేపదే సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తూ వస్తున్నారు.
also read:Chiranjeevi:ఫరియాపై చిరంజీవి సెటైర్.. ఆ మాటతో ఒక్కసారిగా నవ్వులు!
నా లైఫ్.. నా ఇష్టం :
దీని గురించి రీసెంట్‌గా హేమ( Hema) స్పందించారు. నా లైఫ్ నా ఇష్టం అనే విధంగా ఆమె మాట్లాడారు. నేను ఇండస్ట్రీలో ఎంతకాలం ఉన్నానో అనేది అందరికీ తెలుసు. నేను లాస్ట్‌గా తీసుకున్న రెమ్యునరేషన్ రూ.85,000. ఒక రోజుకి రూ.85,000. నేను ఇన్నాళ్లు నా కెరీర్‌లో ఎంత సంపాదించి ఉంటానో. నాకు వేరే బిజినెస్‌లు కూడా ఉన్నాయి. నాకు డబ్బు ఉంటుంది. నేను నా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తాను. నేను కారులో తిరగకూడదా? కారులో తిరగడం తప్పా? అంటూ యాంకర్‌ను సూటిగా ప్రశ్నించింది.
also read:Rashmi Gautam: చీర చెప్పిన స్టోరీ.. బ్యాక్ అందాలతో గిలిగింతలు పెడుతున్న రష్మి గౌతమ్!
యాంకర్‌నే తిరిగి ప్రశ్నించిన హేమ :
అంతేకాదు, యాంకర్‌ని తిరిగి క్వశ్చన్ చేస్తూ.. మీరు ఒకప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు మీకు ఏమీ లేదు. ఇప్పుడు మీరు పెద్ద కారులో తిరుగుతున్నారు. అప్పటికి, ఇప్పటికి నాలుగు సంవత్సరాలు. నాలుగు సంవత్సరాల తేడాలో మీరు బెంజ్ కార్లలో తిరిగినప్పుడు, నేను ఇన్నాళ్ల నా కెరీర్‌లో ఎంత వెనకేసుకుంటాను? ఎంత సంపాదించి ఉంటాను? నేను ఎంత కష్టపడి డబ్బులు సంపాదించుకుంటాను? నా కష్టంతో నేను అనుభవిస్తున్నాను. మధ్యలో ఎందుకు ఇలాంటి మాటలు అన్నీ? అంటూ ఘాటుగాటుగా మాట్లాడేసింది హేమ.
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న హేమ మాటలు :
హేమ మొదటి నుంచి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వ్యక్తిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలాంటి విషయం అయినా తన మనసులో ఉన్న మాటను నేరుగా చెప్పడం ఆమెకు అలవాటు. తాజాగా హేమ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆమె మాట్లాడిన తీరుపై నెటిజన్లలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది హేమ చెప్పిన విషయాల్లో నిజం ఉందంటూ ఆమెకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతూ నెగిటివ్‌గా స్పందిస్తున్నారు.
దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హేమ వ్యాఖ్యలపై చర్చ కొనసాగుతోంది. అయితే ఇలాంటి విమర్శలు, ప్రశంసలను పట్టించుకోకుండా హేమ తన పనిపై, తన జీవితంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎవరు ఏమనుకున్నా తనకు నచ్చిన విధంగా ముందుకు సాగుతూ, తన జీవితాన్ని తనదైన శైలిలో కొనసాగిస్తున్నారు. ఆమె వ్యాఖ్యలపై చర్చ ఎంత జరిగినా తన ప్రయాణాన్ని మాత్రం ఆపడం లేదని అభిమానులు అంటున్నారు.




