Monday, November 9, 2026
HomeLATESTDhanush:సాయి పల్లవికి సపోర్టుగా ధనుష్!

Dhanush:సాయి పల్లవికి సపోర్టుగా ధనుష్!

Dhanush: ప్రముఖ సినీ నటుడు ధనుష్ రామాయణంలో సీత పాత్రలో నటించిన సాయి పల్లవి పై ప్రశంసలు కురిపించారు.

on
- Advertisement -banner Ad

Dhanush:ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో పలు చిత్రాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకుంది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. ఇటీవలే భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన రామాయణ సినిమాలో కూడా సీత పాత్రలో అద్భుతంగా నటించింది. కొంతమంది ఈమె నటనను ప్రశంసిస్తూ ఉండగా.. మరి కొంతమంది కావాలని ట్రోలింగ్ చేస్తున్నారు. అలా ట్రోలింగ్ చేస్తున్న వారికి కోలీవుడ్ హీరో ధనుష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. సీత పాత్రకు సాయి పల్లవి మించిన పర్ఫెక్ట్ ఛాయిస్ మరొకరు లేరు అనే విషయం పైన కూడా కుండ బద్దలు కొడుతూ ఆమెకు సపోర్ట్ చేశారు ధనుష్.

సాయి పల్లవి సీత పాత్ర పై ధనుష్ ప్రశంసలు..

ధనుష్ (Dhanush)నటించిన ఓం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సమయంలో సాయి పల్లవి పైన వస్తున్న విమర్శలపై నేరుగా స్పందించారు.. ఆమెను తక్కువ చేసి మాట్లాడుతున్న వారందరినీ కూడా తీవ్రస్థాయిలో తప్పుపడుతూ ఫైర్ అయ్యారు.. షూటింగ్ బ్రేక్ సమయంలో సాయి పల్లవి నిరంతరం ప్రార్థనలు చేస్తూ ఉండే వారని.. దేవుడు పైన ఎంతో భక్తి ఉంటేనే అలా చేయగలరు.. ఆమె మనసు చాలా స్వచ్ఛమైనది.. ఆమె చూడడానికి అందంగా ఉండడమే కాకుండా అద్భుతమైన నటి. సీత పాత్రలో సాయి పల్లవి కంటే మరెవరు కూడా బాగా నటించలేరు అనేదే నా అభిప్రాయము ఆ పాత్రకు ఆమె పర్ఫెక్ట్ ఛాయస్ అంటూ తెలిపారు.

- Advertisement -
Advertisement

also read:Anupama parameswaran: దీపావళి వేళ ఎరుపు చీరలో ఆకట్టుకున్న అనుపమ.. ఫొటోస్ వైరల్!

సాయి పల్లవి నటన అమోఘం..

మొదటిసారి మారి 2 చిత్రంలో నటిస్తున్న సమయంలో ఆమెతో పనిచేశాను. ఆమె చాలా సైలెంట్ గా ఉండేవారు. కెమెరా ఆన్ లో ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడేవారు.. కానీ ఇప్పుడు అలా లేరు. యాక్టింగ్ పైన తనకి మంచి అవగాహన పెంచుకున్నది. ఆమె యాక్టింగ్ , హావభావాలు, స్క్రీన్ ప్రజెంట్స్ చాలా అద్భుతంగా ఉంది. సీత పాత్ర చేయడం అంటే అంత ఈజీ కాదు. అయినప్పటికీ కూడా ఎంతో అద్భుతంగా నటించింది అంటూ ధనుష్ తెలియజేశారు. డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో రామాయణ సినిమా రూ .4000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు.

- Advertisement -
Advertisement

also read:Ranbir Kapoor:సినిమాలకి గుడ్ బై చెప్పనున్న రణబీర్ కపూర్.. కారణం..?

ధనుష్తో ఓం చిత్రంలో నటిస్తున్న సాయి పల్లవి..

ప్రస్తుతం ధనుష్ నటించిన ఓం సినిమాలో మమ్ముట్టి , శ్రీ లీల, సాయి పల్లవి నటిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి నిత్య రెడ్డి అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతోంది. మారి 2 తర్వాత ధనుష్ సాయి పల్లవి కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడం చేత, ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని అమరన్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియా స్వామి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 20వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ లో సాయి పల్లవికి ధనుష్ మద్దతు పలకడంతో అటు ఆమె అభిమానులు సైతం ధనుష్ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఓం సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you