Saturday, September 26, 2026
HomeLATESTFilm industry: పెళ్లయిన హీరోతో ఎఫైర్.. కెరియర్ నాశనం చేసుకున్న హీరోయిన్.

Film industry: పెళ్లయిన హీరోతో ఎఫైర్.. కెరియర్ నాశనం చేసుకున్న హీరోయిన్.

Film industry: ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా మంచి పేరు సొంతం చేసుకుని అవకాశాలు అందుకుంటున్న సమయంలో ఆ హీరోయిన్ చేసిన తప్పిదం ఆమె జీవితాన్ని నాశనం చేసింది.

on
- Advertisement -banner Ad

Film industry: సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవడం ఎంత కష్టమో .. వచ్చిన అవకాశాలను కూడా నిలబెట్టుకోవడం అంతే కష్టమని చెప్పవచ్చు. కొంతమంది నటీనటులు వరుసగా స్టార్డం అందుకుంటూ ఉంటే.. మరి కొంతమంది అనుకోని పరిణామాలతో అనూహ్య మలుపు తిరుగుతుంది. అలా కెరియర్ మలుపు తిరిగిన హీరోయిన్లలో హీరోయిన్ నికిత కూడా ఒకరు. తెలుగు , తమిళ్, కన్నడ వంటి భాషలలో పలు చిత్రాలలో నటించిన ఈమె.. ఒకప్పుడు అవకాశాలతో చాలా బిజీగా ఉండేది. కానీ కేవలం ఒకే ఒక వివాదం కారణంచేత ఈమె కెరియర్ పైన అది చాలా ప్రభావం చూపించింది

కెరియర్ పీక్స్ లో ఉండగానే ఇండస్ట్రీకి దూరం..

నిఖిత 2002లో వచ్చిన హాయ్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి(Film industry) ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కళ్యాణ రాముడు సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ఖుషి ఖుషీగా, ఏవండోయ్ శ్రీవారు, మహారాజశ్రీ వంటి చిత్రాలలో నటించి బాగానే ఆకట్టుకుంది. నాగార్జున నటించిన డాన్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా కూడా అలరించింది. తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ వంటి భాషలలో నటించిన నిఖితకు భారీగానే అవకాశాలను అందుకుంది. ముఖ్యంగా కన్నడలో పలు సినిమాలలో నటించి గుర్తింపు సంపాదించుకున్న నికిత హీరోయిన్గా టాప్ పొజిషన్లో మంచి ఊపులో ఉన్న సమయంలో ఈమె వ్యక్తిగత జీవితం చుట్టూ ఒక వివాదం చెలరేగింది.

- Advertisement -
Advertisement

also read:Dhanush:ధనుష్- వడివేలు మధ్య విభేదాలు?

చిన్న తప్పు.. జీవితమే నాశనం..

అదేమిటంటే ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తో నిఖిత చాలా సన్నిహితంగా ఉన్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. ఆ సమయంలో దర్శన్ కి వివాహం అయ్యింది. ఈ విషయం దర్శన్ భార్య విజయలక్ష్మి కి తెలియడంతో ఆమె పోలీసులను ఆశ్రయించి మరి దర్శన్ ని అరెస్ట్ చేయించింది. ఈ ఘటన అప్పట్లో కన్నడ ఇండస్ట్రీలో సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఈ వివాదం హీరోయిన్ నిఖిత సినీ కెరియర్ పైన చాలా గట్టిగానే చూపించిందని చెప్పవచ్చు. కొన్నేళ్లపాటు కన్నడ సినీ ఇండస్ట్రీలో ఆమె పైన నిషేధం విధించారు.

- Advertisement -
Advertisement

also read:Keerthy Suresh:డోరతీ మూవీ చూసి షాకైన నెటిజన్లు.. ఆ సీన్లపై సోషల్ మీడియాలో దుమారం!

నిషేధం ఎత్తివేసినా .. అందని అవకాశం..

కొన్నేళ్ళకు నిషేధం ఎత్తివేసినా అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో కెరీయర్ ఆరంభంలో మంచి మంచి అవకాశాలు అందుకున్న హీరోయిన్ నిఖిత క్రమంగా సినిమాలకు దూరమై 2017లో ప్రముఖ వ్యాపారవేత్త గగన్ దీప్ సింగ్ ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత కుటుంబ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన నిఖిత అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు తన కుటుంబానికి సంబంధించిన విషయాలను పంచుకుంటుంది. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ నిఖిత .. చిన్న వాటి మిస్టేక్ వల్ల తన కెరీర్నే నాశనం చేసుకుంది. మరి రాబోయే రోజుల్లోనైనా తిరిగి సినిమాలలోకి రీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించి న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you