Amitabh Bachchan:సెలబ్రిటీలకు ఈ మధ్యకాలంలో ఎక్కువగా గ్యాంగ్ స్టార్ నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఈ విషయం సినీ సెలబ్రిటీలను మరింత భయభ్రాంతులకు గురిచేస్తుందని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబానికి వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇప్పటికి ఒక గ్యాంగ్ అమితాబ్ ను టార్గెట్ చేసినట్లుగా ప్రకటించగా.. ఇప్పుడు మరొక గ్యాంగ్ స్టార్ కూడా అమితాబ్ తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ పైన బెదిరింపులు చేయడం ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
అమితాబ్ కుటుంబానికి తప్పని బెదిరింపులు..
అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్(Amitabh Bachchan) పైన గ్యాంగ్ స్టార్ గోల్డీ ధిల్లాన్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్టు వైరల్ గా మారింది.. వారిద్దరిని లక్ష్యంగా చేసుకొని ముంబైలో తన అనుచరులను 200 మందిని సిద్ధంగా చేశామంటూ అతడు ప్రకటించిన తీరు భయభ్రాంతులకు గురిచేసింది. అంతేకాకుండా ఎన్ని బుల్లెట్ ప్రూఫ్ గాజు అద్దాలు పెట్టుకున్న సరే, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్న సరే వారిని ఎవరూ కాపాడలేరు. తమ గురి తప్పదు అంటూ కూడా తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇవ్వడం అభిమానులను మరింత భయభ్రాంతులకు గురయ్యేలా చేస్తుంది.
also read:Ramu rathod:అల్లు అర్జున్ రికార్డును బద్దలు కొట్టిన ఫోక్ సింగర్..!
అప్రమత్తమైన పోలీసులు..
గోల్డీ ధిల్లాన్ పెట్టిన పోస్ట్ పైన పోలీసులు సైతం వెంటనే అప్రమత్తమయి దర్యాప్తును చేపట్టారు. అయితే ఇందులో నిజానిజాలు ఎంత ఉన్నాయి అనే విషయం పైన ఆరా తీస్తున్నారు. గోల్డీ ధిల్లాన్ గ్యాంగ్ కు సంబంధించి ఇద్దరు అనుచరులను ఢిల్లీ పోలీసులు ఇటీవలే అరెస్టు చేయగా.. విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి.. ముంబై ప్రాంతంలో అమితాబ్ బచ్చన్ ఇంటి వద్ద కాల్పులకు ప్రయత్నించినట్లు ఢిల్లీ పోలీసులు అనుమానంతో తెలియజేశారు. అమితాబ్ , అభిషేక్ బచ్చన్ తో పాటుగా ఢిల్లీ ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారిని ఈ గ్యాంగ్ స్టార్ టార్గెట్ చేసినట్లుగా పోలీస్ దర్యాప్తులలో బయటపడింది.
also read:Kalki 2:నైజాంలో ప్రభాస్ సరికొత్త రికార్డ్.. రూ.108 కోట్లకు ‘కల్కి 2’ బిజినెస్!
బాలీవుడ్ లో కలకలం రేపుతున్న బెదిరింపులు..
ఇప్పటికే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులతో బాలీవుడ్ సెలబ్రెటీలు మరింత ఆందోళన పడుతూ ఉండగా.. సల్మాన్ ఖాన్ ని టార్గెట్ చేయగా ఇప్పుడు మిగిలిన హీరోల పైన కూడా కొంతమంది గ్యాంగ్ స్టార్స్ ఇలాంటి బెదిరింపులు చేయడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో అమితాబ్ ఒక్కరోజు తన ఇంటి ముందు అభిమానులను పలకరిస్తూ ఉంటారు. గత వారం రోజుల నుంచి అమితాబ్ బచ్చన్ బుల్లెట్ ప్రూఫ్ క్యాబిన్ ని ఏర్పాటు చేసుకొని మరి పలకరించడం అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. ఇప్పుడు ఏకంగా గోల్డీ ధిల్లాన్ గ్యాంగ్ హెచ్చరికలు జారీ చేయడంతో అమితాబ్ బచ్చన్ ఇంటి వద్ద మరింత భద్రత పెంచేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ విషయం పైన అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.




