Wednesday, November 18, 2026
HomeLATESTSai Pallavi:ఓం సినిమా కోసం అలాంటి పని చేసిన సాయి పల్లవి..!

Sai Pallavi:ఓం సినిమా కోసం అలాంటి పని చేసిన సాయి పల్లవి..!

Sai Pallavi: నటన మీద ఉన్న ఇష్టంతో పాత్రకు మంచి పేరు తీసుకురావడానికి ఓం సినిమా కోసం సాయి పల్లవి కీలక నిర్ణయం తీసుకుంది.

on
- Advertisement -banner Ad

Sai Pallavi:తెలుగు సినీ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా పేరు సంపాదించిన సాయి పల్లవి ఈమధ్య పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా సరే నటించడానికి సిద్ధమవుతోంది. అంతేకాకుండా ఆ పాత్రకు తగ్గట్టుగా తనని తాను మార్చుకోవడానికి ఎలాంటి పని చేయడానికి అయినా వెనుకాడడం లేదు. అందుకే ఈమెను లేడీ పవర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు అభిమానులు. ఇప్పుడు తాను నటించిన ఓం సినిమా కోసం చేసిన పని వల్ల సాయి పల్లవి పైన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఓం సినిమా కోసం జుట్టు కత్తిరించుకున్న సాయి పల్లవి..

సాయి పల్లవి పొడవాటి జుట్టుతో అన్ని సినిమాలలో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఓం సినిమాలో మాత్రం తన జుట్టును చిన్నగా చేసి చూపించారు.. అయితే అదంతా విగ్గు అని చాలామంది అనుకున్నప్పటికీ.. కానీ తాను మాత్రం అది విగ్గు కాదని ఏకంగా తన జుట్టునే కత్తరించుకున్నాను పాత్ర కోసం అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ నిర్ణయం పట్ల ఆమె తల్లిదండ్రులు మొదట అసహనానికి గురైనప్పటికీ .. ఆ తర్వాత సాయి పల్లవి చెప్పిన విషయాలకు తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారట. డైరెక్టర్ పెరియ స్వామి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో.. ధనుష్, శ్రీ లీల, మమ్ముట్టి, రేణు దేశాయ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Renu Desai:ధనుష్ కి క్షమాపణలు చెప్పిన రేణూ దేశాయ్..!

స్పందించిన సాయి పల్లవి..

ఈ చిత్రం నవంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో చిత్ర బృందం వేగంగా పాల్గొంటుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. తన కొత్త హెయిర్ స్టైల్ వెనుక ఉన్న విషయాలను పంచుకుంది.. సాయి పల్లవి(Sai Pallavi) ఓం సినిమాలో ఐపీఎస్ నిత్యా రెడ్డి అనే ఒక పవర్ఫుల్ అడిషనల్ ఎస్పీ పాత్రలో కనిపించబోతున్నారు.. ఈ సినిమాలో తాను కూడా ఆ పాత్రలో నటించడానికి జుట్టు కట్ చేసుకున్నానని ఆ వెంటనే తమ తల్లిదండ్రులకు వీడియో కాల్ చేశాను..నన్ను ఆ లుక్కులో చూడగానే ఒకసారిగా ఆశ్చర్యపోయారు. ఏమి మాట్లాడకుండా ఫోన్ కట్ చేశారని తెలిపింది. ఆ తర్వాత మా నాన్న ఫోన్ చేసి పల్లవి అది విగ్గు కదా అని.. నమ్మలేనట్లుగా అడిగారు. నిజం చెప్పాక ఆయన అర్థం చేసుకున్నారని, తన అమ్మ కూడా సముదాయించారంటూ తెలియజేసింది.

- Advertisement -
Advertisement

also read:Amitabh Bachchan:బిగ్ బీ కుటుంబానికి గ్యాంగ్ స్టార్ బెదిరింపులు..!

జుట్టు కత్తిరించడం వెనుక అసలు కారణం..

ఈ లుక్ వెనుక ఉన్న స్ఫూర్తిని వివరిస్తూ.. డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి తనకు ఒక ప్రముఖ ఐపీఎస్ అధికారి మెరీన్ జోసెఫ్ ఫోటోలను చూపించారని.. ఆమె చిన్న జుట్టుతో కనిపించడంతో తాను ఎలా అలా కనిపిస్తారని డైరెక్టర్ ని అడిగాను దానికి ఆయన ఏమాత్రం తడుముకోకుండా నువ్వు జుట్టు కత్తిరించుకుంటే అచ్చం ఆమెలాగే ఉంటావని చెప్పారు.. డైరెక్టర్ రాజ్ కుమార్ విజయం పైన ఉన్న నమ్మకంతోనే తాను ఈ సాహసం చేయగలిగానని మరి ఇతర దర్శకుడు కోసమైనా తాను ఇలా జుట్టు కత్తిరించుకునే దాన్ని కాదేమో అంటూ తెలియజేసింది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన అమరన్ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you