Monday, August 10, 2026
HomeLATESTToxic:‘టాక్సిక్’ ట్రైలర్ ఈవెంట్‌లో గీతూ మోహన్ దాస్ ఎమోషనల్..!

Toxic:‘టాక్సిక్’ ట్రైలర్ ఈవెంట్‌లో గీతూ మోహన్ దాస్ ఎమోషనల్..!

Toxic:రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

on
- Advertisement -banner Ad

Toxic:రాకింగ్ స్టార్ యశ్ హీరోహా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పీరియడ్ యాక్షన్ డ్రామా “టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్” ఈ సినిమాపై జనాలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు అనేది అందరికీ తెలిసిందే. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ని ఆగస్టు 8న మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ట్రైలర్ పై పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
టాక్సిక్ (Toxic)ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకురాలు గీతూ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాలలో చర్చనీయాంసంగా మారాయి.

తల్లికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు:

ఈ సినిమా కోసం తాను ఎదుర్కొన్న సవాలను గుర్తు చేసుకున్న గీతూ మోహన్ దాస్ తన కుటుంబం అందించిన సహకారాన్ని ప్రస్తావిస్తూ ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా తన కుమార్తెను జాగ్రత్తగా చూసుకున్న తల్లికి కృతజ్ఞతలు తెలిపారు .ఇలాంటి అద్భుతమైన టీం తో కలిసి పని చేసే అవకాశం రావడం తన అదృష్టం అని పేర్కొన్నారు.

- Advertisement -
Advertisement

also read:Vijay:సంగీత నిజంగానే దేవత.. విడాకుల పిటీషన్ ఎందుకు వెనక్కి తీసుకుందో తెలుసా..?

యశ్ ఒక ఎమోషన్:

హీరో యశ్ గురించి గీతూ చేసిన వ్యాఖ్యలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తన దృష్టిలో యశ్ కేవలం స్టార్, నిర్మాత, నటుడు లేదా సహా రచయిత మాత్రమే కాదని ఆయన ఒక ఘాడమైన భావోద్వేగమని అన్నారు. ఈ సినిమా తర్వాత తన కెరీర్ ఎలా సాగుతుందో తెలియదని అయితే యశ్ లోని ఒక భాగాన్ని ఎప్పటికీ తనతో తీసుకెళ్తానని గీతూ పేర్కొన్నారు. తనను నమ్మి ఇంతటి సవాలుతో కూడిన ప్రాజెక్టును అప్పగించినందుకు యశ్ కి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు.

- Advertisement -
Advertisement

also read:Ajay Bhupathi :‘శ్రీనివాస మంగాపురం’ ఫ్లాప్.. అజయ్ భూపతి మాటలకు నెటిజన్లు ఫిదా!

ఇది నీ వల్ల కాదు అన్నవారికి గట్టి సమాధానం :

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టార్ యాక్షన్ చిత్రాన్ని మహిళా దర్శకురాలు ఎలా హ్యాండిల్ చేస్తారనే విమర్శకులు ప్రారంభంలో ఎదురయ్యాయి అని గీత వెల్లడించారు. ఇది నీవల్ల కాదు అని చెప్పిన వారికి తన ప్రతిభను ఈ సినిమాతో నిరూపించానని ఆమె స్పష్టం చేశారు.

- Advertisement -
Advertisement

భారీ స్థాయి యాక్షన్ చిత్రాన్ని మహిళా దర్శకురాలు తెరకె.క్కించడం ద్వారా గీతు కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్లు సినీ వర్గాలలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యశ్ నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాత, సహరచాయతగా ఆమె విజన్ కు అండగా నిలవడం కూడా ఈ ప్రాజెక్టు పై ఆసక్తిని మరింత పెంచుతుంది. చూడాలి మరి ఈ సినిమా అభిమానులను ఎలా ఆకట్టుకుంటుందో. ట్రైలర్ మాత్రం జనాలకి పిచ్చి ఎక్కించేస్తుంది. కాన్సెప్ట్ అర్ధం కాక పోయినా..మ్యూజిక్, యాక్షన్ సీన్స్, డైలాగ్స్ జనాలకి బాగా నచ్చేశాయి. ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది..!

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you